వేసవిలో సోంపుతో జీర్ణ సమస్యలకు చెక్

Health news:వేసవిలో సోంపుతో జీర్ణ సమస్యలకు చెక్

  1. వంటగదిలోనే సహజ ఔషధం
  2. జీర్ణక్రియకు సోంపు అద్భుతం
  3. గ్యాస్, ఉబ్బరానికి సహజ పరిష్కారం
  4. అలసట తగ్గించే సోంపు టీ

Health news Health tips Health updates in Telugu Health newsIndia Good health news HealthNews Daily health tips health tips in Telugu Health care news


వేసవి కాలం ప్రారంభంతో భానుడి భగభగలు పెరుగుతున్నాయి. ఈ ఎండల ప్రభావంతో కడుపులో వేడి, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి చిన్న సమస్యకు మందులపై ఆధారపడకుండా వంటగదిలో ఉన్న సోంపు గింజలతోనే వీటికి సులభంగా పరిష్కారం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం సోంపు శరీరంలోని పైత్య దోషాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది చలువ చేసే గుణం కలిగి ఉండటం వల్ల వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, సహజ నొప్పి నివారణ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక టీస్పూన్ సోంపు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ వేగవంతమవుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోంపు నీరు తాగడం వల్ల ప్రేగుల పనితీరు మెరుగై మలబద్ధకం తగ్గుతుంది. అలాగే కడుపు నొప్పి, నెలసరి సమయంలో వచ్చే అసౌకర్యాన్ని కూడా ఇది తగ్గించడంలో సహాయపడుతుంది. వేసవిలో అలసటను తగ్గించడానికి సోంపు టీ చాలా ఉపయోగకరం. ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ సోంపు వేసి మరిగించి, వడకట్టి తేనె కలిపి తాగితే శరీరం తాజాగా ఉంటుంది. భోజనం తర్వాత ఈ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే సోంపు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దీనిని అతిగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా గర్భిణీలు వైద్యుల సలహాతోనే ఉపయోగించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments