పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం!

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం!

  • పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతినకుండా చట్టం రూపొందించండి
  • దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం
  • సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు
  • మంత్రుల బృందం సమావేశంలో నారా లోకేష్ స్పష్టీకరణ

అమరావతి: సోషల్ మీడియాకు 13 సంవత్సరాల లోపు బాలలను దూరంగా ఉంచడంపై విధివిధానాలు తయారుచేసి, ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధివిధానాల తయారీ, చట్టరూపకల్పనపై ఉండవల్లి నివాసంలో మంత్రుల బృందం… సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ప్రతినిధులు, అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 

సోషల్ మీడియా దుష్ప్రభావానికి లోనుకాకుండా 13 నుంచి 16సంవత్సరాల పిల్లలకు వయసు ఆధారిత కంటెంట్ ను అందుబాటులో ఉంచేవిధంగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో మహిళలపట్ల అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పిల్లల డిజిటల్ భద్రత, శ్రేయస్సు, లీగల్ మెకానిజం ఫ్రేమ్ వర్క్ పై ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధికారులు అధ్యయనం చేయాలన్నారు. పిల్లలను సెన్సిటివ్ కంటెంట్ కు దూరంగా ఉంచడంపై ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. నో బ్యాగ్ డే రోజున ఉపాధ్యాయులు విద్యార్థులకు, ప్రతిఏటా రెండుసార్లు నిర్వహించే మెగా పిటిఎంలో కూడా తల్లిదండ్రులు, విద్యార్థులకు సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు. మహిళలభద్రతపై స్వయంసహాయ సంఘాల మహిళలకు కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు.

వయసు నిర్దారణ కోసం డిజిలాకర్ తో కూడిన ఏజ్ టోకెన్ ల వినియోగంపై అధ్యయనం చేయాల్సిందిగా మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయం అనంతరం కేంద్రప్రభుత్వ చట్టపరిధిలోని అంశాలపై నివేదికను అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సున్నితమైన కంటెంట్ ను చిన్నపిల్లలకు దూరంగా ఉంచడంపై విధివిధానాలు, ఫిర్యాదులపై తీసుకుంటున్న ర్యలను వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ప్రతినిధులు మంత్రుల బృందానికి వివరించారు. ఆంధ్రప్రదేేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు తమవంతు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. ఐటి చట్టంలోని సెక్షన్ – 46 కింద న్యాయ నిర్ణయాధికారిని వెంటనే నియమించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, జిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఐ & పీఆర్ డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్, ఆకే రవికృష్ణ (ఐజీ, ఈగల్, ఇన్ చార్జ్, సైబర్ క్రైమ్), అదిరాజ్ సింగ్ రానా ఎస్పీ సైబర్ క్రైమ్,

పి.కిరణ్ కుమార్ (జాయింట్ డైరెక్టర్, ఐ & పీఆర్), పి.జయరావు, చీఫ్ జనరల్ మేనేజర్ (సోషల్ మీడియా & డిజిటల్ మీడియా, డిజిటల్ కార్పోరేషన్), ఒ.మధుసూదనరావు (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, ఐ &పీఆర్), ప్రాసిక్యూషన్ డైరెక్టర్ రామకోటేశ్వరరావు, మెటా డైరక్టర్ నటాషా జోగ్, యూట్యూబ్ పబ్లిక్ పాలసీ మేనేజర్ మీరా స్వామినాథన్, ఎక్స్ పబ్లిక్ పాలసీ ప్రొఫెషనల్ జప్రీత్ గ్రెవల్, షేర్ చాట్ పాలసీ హెడ్ తమోగా గోస్వామి, జోష్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రామానుజన్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments