కర్నూలు జడ్పీ చైర్మన్ పీఠాన్ని వాల్మీకి బోయలకు కేటాయించాలి

కర్నూలు జడ్పీ చైర్మన్ పీఠాన్ని వాల్మీకి బోయలకు కేటాయించాలి

* గౌరీ గోపాల్ వద్ద మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి
* స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని వెల్లడి

-వాల్మీకి సంఘాల డిమాండ్

కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన వాల్మీకి (బోయ) సామాజికవర్గానికి కేటాయించాలని వాల్మీకి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా నగరంలోని గౌరీ గోపాల్ వద్ద ఉన్న మహర్షి వాల్మీకి విగ్రహానికి వారు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో నేటి వరకు వాల్మీకి సామాజికవర్గానికి జడ్పీ చైర్మన్ పీఠాన్ని కేటాయించలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం జడ్పీ చైర్మన్ పదవిని బిసి కేటగిరీకి కేటాయించినందున, జిల్లా జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న వాల్మీకి బోయలకు ఈసారి అవకాశం కల్పించాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాల్మీకి బోయలు కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు బేతం కృష్ణుడు, కుబేర స్వామి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మహర్షి రమణ మరియు స్థానిక వాల్మీకి సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments