- పంట కాల్వల పునరుద్ధరణ పనులు – ఆనందంలో రైతన్నలు
- పెద్దటేకూరు పంట కాల్వ పూడికతీత పనులతో రైతులలో చిగురిస్తున్న ఆశలు
కర్నూలు జిల్లాలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జలధార-జలహారతి’ ద్వారా జిల్లాలోని చెరువులు, కుంటలు పునరుజ్జీవం పోసుకుంటున్నాయి. దశాబ్దాలుగా జిల్లాను వెన్నాడుతున్న కరువు రక్కసిని తరిమికొట్టేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి దిశానిర్దేశంలో ‘జలధార-జలహారతి’ పథకం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. సాగునీటి శాఖ అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పెద్ద టేకూరు గ్రామములో అధిక కుటుంబాలు వ్యవసాయం, పాలవ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడికి సమీపములో హెచ్.ఎన్.ఎన్.ఎస్ ప్రధాన కాల్వ వెళ్ళుతున్నప్పటికి అధిక శాతం రైతులు మెట్ట వ్యవసాయమే జీవనాధారంగా చేసుకొని పంటలు పండించుకొంటూ జీవిస్తున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొని వర్షాలు సకాలంలో కురువక పంటలు సరిగా పండక, పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక రైతన్నలు నష్టాల బాటలో పయనిస్తున్నారు. ఈ సమయంలో గ్రామంలో వి బి జి రామ్ జి పథకం ద్వారా గ్రామాలలోని కుంటల్లో, చెరువుల్లో, వంకల్లో పుడికతీత పనులు చేపట్టుటకు హెచ్.ఎన్.ఎన్.ఎస్ ప్రధాన కాల్వ నుంచి కోటేశ్వర రావు పొలం వరకు కాల్వ పునరుద్ధరణ పనులు రెండు అడుగుల లోతుతో 1200 మీటర్ల పొడవున వి బి జి రామ్ జి పథకం ద్వారా శ్రామికులతో పనులు చేపట్టుటకు రూ.4,48,113/- నిధులు మంజూరు చేశారు. ఈ పనులను జలధార-జలహారతి కార్యక్రమములో భాగంగా శ్రామికులతో చురుకుగా చేయిస్తున్నారు. గ్రామసమీపంలో పనులు కల్పించటంతో ఇటు శ్రామికులు ఆనందంగా ఉదయాన్నే వచ్చి పనులు చేస్తున్నారు. పంట కాల్వ పునరుద్ధరణతో రెండుకార్లు పంటలు పండించుకోవచ్చునని రైతులు ఆనందంగావున్నారు.
పంటకాల్వ పూడిపోవడంతో నీరురాక, సాగునీరు పెట్టక పొలాలు వర్షాధారం ద్వారానే మెట్ట పంటలు సాగు చేసుకొనే వారు పెద్దటేకూరు గ్రామ రైతులు. వి బి జి రామ్ జి పథకం ద్వారా జలధార-జలహారతి కార్యక్రమములో పంటకాల్వల పునరుద్ధరణకై పుడికతీత పనులు చేస్తున్నారు. దీంతో కాలవకు ఇరువైపుల వున్న 150 ఎకరాల చిన్న, సన్నకారు రైతుల భూములకు సాగునీరు అందుతుంది. దీంతో ఈ భూముల్లో రెండుకార్ల పంటలు సాగునీటితో పండించుకోవచ్చునని, లాభాలు వస్తాయని ఇక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పంటలకోసం గతంలో చేసిన అప్పులు తీరుతున్నాయి-చిన్న రాముడు, పెద్ద టేకూరు రైతు
గతంలో పంటకాల్వ పూడిపోవడంతో నీరురాక, సాగునీరు పెట్టక పొలాలు వర్షాధారం ద్వారానే మెట్ట పంటలు సాగు చేసుకొని నష్టాల పాలు అయ్యమన్నారు. ప్రస్తుతం వి బి జి రామ్ జి పథకం ద్వారా జలధార-జలహారతి కార్యక్రమములో పంటకాల్వల పునరుద్ధరణకై పుడికతీత పనులు చేస్తున్నారు. పనులు పూర్తయితే కాలవకు ఇరువైపుల వున్న 150 ఎకరాల చిన్న, సన్నకారు రైతులకు చెందిన భూములకు సాగునీరు అందుతుందని రెండుకార్ల పంటలు సాగుచేసుకోవటానికి వీలవుతుందని పంటకాల్వల పునరుద్ధరణకై సహకరించిన అధికారులకు రైతులు కృతఙ్ఞతలు తెలిపారు.