peoplesmotivation.com
Newspaper Banner
Date of Publish : 07 May 2026 Editor : Admin

రెవెన్యూ సమస్యల కోసం ఒక నెల – ఒక గ్రామం కార్యక్రమం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});
  • రెవెన్యూ సమస్యల కోసం ఒక నెల – ఒక గ్రామం కార్యక్రమం
  • జిల్లాలో రేపటి గురువారం నుంచే ఈ కార్యక్రమం అమలుకు శ్రీకారం
  • గ్రామాలను ‘రెవెన్యూ ఫిర్యాదుల రహిత గ్రామాలు’గా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం
  • ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
  • -జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

Kurnool district collector revenue clinics in villagesగ్రామాలను ‘రెవెన్యూ ఫిర్యాదుల రహిత గ్రామాలు’గా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల – ఒక గ్రామం – నాలుగు పర్యటనలు కార్యక్రమం అమలు చేస్తోందని, జిల్లాలో ఈ కార్యక్రమం రేపటి గురువారం నుంచే ప్రారంభించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో భూసమస్యలను సత్వరంగా, నాణ్యమైన పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తయిన గ్రామాలు లేదా భూ సమస్యలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తహసిల్దార్, ఎంపీడీవో, ఏఈ పిఆర్, ఏఈ హౌసింగ్, ఏఈ జల వనరుల శాఖ, ఏఈ ఆర్డబ్ల్యూఎస్, ఎండోమెంట్స్, అటవీ శాఖ తదితర మండల స్థాయి అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగా మొదటి గురువారం ప్రజల నుండి వినతులను స్వీకరించడంతో పాటు ప్రభుత్వ భూములను పరిశీలించడం, విచారణలు చేపట్టడం, నోటీసులు అందచేయడం వంటి ప్రక్రియలను నిర్వహించాలని తెలిపారు. రెండవ గురువారం మొదటిసారి స్వీకరించిన అర్జీలను పరిష్కరించడం, కొత్తగా వినతులు తీసుకోవడం చేయాలన్నారు. గురువారం గత రెండు గురువారాల్లో స్వీకరించిన వినతుల పరిష్కారం గురించి, విచారణలు, ఉత్తర్వుల గురించి ప్రజలకు తెలియపరచడం చేయాలన్నారు. నాలుగవ గురువారం గత మూడు గురువారాల్లో ఏమేమి సమస్యలను పరిష్కరించారన్న వివరాలను గ్రామ సభ నిర్వహించి ప్రజలకు వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. భూ సమస్యల సత్వర పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఒక నెల- ఒక గ్రామం- నాలుగు పర్యటనలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.