(adsbygoogle = window.adsbygoogle || []).push({});
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్టైఫండ్
- – బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
- – నంద్యాల, కర్నూలు జిల్లాల వారికి అవకాశం.. జూలై 17 వరకు ఆఖరు తేదీ
రాయలసీమ ప్రాంతంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ అమరావతి వారి ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్–2 మరియు డీఎస్సీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన డిగ్రీ అర్హత కలిగిన బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తుకు కావలసిన పత్రాలు:
అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు క్రింది పత్రాల రెండు సెట్స్ జిరాక్స్ కాపీలను జతచేయాలి. విద్యార్హత సర్టిఫికెట్లు (డిగ్రీ మార్కు లిస్టులు), కుల ధృవీకరణ పత్రం,
ఆదాయ ధృవీకరణ పత్రం (ఒక లక్ష లోపు), బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్,
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, భర్తీ చేసిన దరఖాస్తు ఫారమ్.
దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 17-07-2026 (సాయంత్రం 5:00 గంటల లోపు)
60 రోజుల పాటు ఉచిత శిక్షణ – స్టైఫండ్ సదుపాయం:
అభ్యర్థుల ఎంపిక డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. మొత్తం 100 మంది అభ్యర్థులను ఈ శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జూలై 22, 2026 నుండి బీసీ స్టడీ సర్కిల్ నందు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ఈ శిక్షణ కాలం 60 రోజుల పాటు ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేయడంతో పాటు, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం తరఫున ‘స్టైఫండ్’ (Stipend) కూడా మంజూరు చేయబడుతుంది. ఈ సువర్ణావకాశాన్ని నంద్యాల, కర్నూలు జిల్లాల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం కోరింది.
వివరాలకు సంప్రదించవలసిన చిరునామా:
జె.బి.బి.ఎస్.బి.సి స్టడీ సర్కిల్,
క్వార్టర్ నెం.ఆర్.6, ఆర్టీఓ ఆఫీస్ వెనుక, అబ్బాస్ నగర్,
కర్నూలు – 518 002.
ఫోన్ నెంబర్: 08518 236076