peoplesmotivation.com
Newspaper Banner
Date of Publish : 15 May 2026 Editor : Admin

జిల్లాలో ఎస్ఐఆర్ శిక్షణకు ఏర్పాట్లు చేయండి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జిల్లాలో ఎస్ఐఆర్ శిక్షణకు ఏర్పాట్లు చేయండి

జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు:- జిల్లాలో ఎస్ ఐ ఆర్ పై వీఆర్వోలు, ఏ ఈ ఆర్ వో లు, బి ఎల్ వోలు, బిఎల్ఏలు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు శిక్షణ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి డీఆర్వో ను ఆదేశించారు. బుధవారం ఎస్ ఐ ఆర్, ఎన్నికల సమాచారం, సేవలకు సంబంధించిన ECINET అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఎన్నికల అధికారి ఎస్ ఐ ఆర్ పై శిక్షణ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో ఎవరెవరు ఉంటారు, తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ లో ఎవరెవరు ఉంటారు,ఓటర్ ల ను డిలీట్ ఏవిధంగా చేయాలి అన్న అంశాలను వివరించడం జరుగుతుందన్నారు. గతం లో ఈ ప్రక్రియ ఈఆర్ఓ నెట్ ద్వారా జరిగేదని, ఇప్పుడు ఈసీఐ నెట్ ప్రక్రియ ద్వారా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ వెంకటనారాయణమ్మ , ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి హాజరయ్యారు.