peoplesmotivation.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026 Editor : Admin

జలధార..జలహారతితో నీటి వనరుల పునరుజ్జీవం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*లధార..జలహారతిజతో నీటి వనరుల పునరుజ్జీవం

*246 చెరువుల పునరుద్ధరణకు ప్రణాళికలు

*48,488 నీటి సంరక్షణ నిర్మాణాలకు శ్రీకారం

*148 (ట్యాంక్ బెడ్ల) చెరువు పూడికతీత పనులతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం రెట్టింపు

*86 చెరువుల గట్లను బలోపేతం

*48 తూములు, 37 అలుగుల మరమ్మతులతో పాత సాగునీటి వ్యవస్థకు కొత్త జీవం

*484 గ్రామాల్లో రైతు సంఘాల పర్యవేక్షణలోనే పనులు జరుగుతుండటంతో పారదర్శకతకు పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జలధార-జలహారతి’ ద్వారా జిల్లాలోని చెరువులు, కుంటలు పునరుజ్జీవం పోసుకుంటున్నాయి. దశాబ్దాలుగా జిల్లాను వెన్నాడుతున్న కరువు రక్కసిని తరిమికొట్టేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. జిల్లా కలెక్టర్ డా. సిరి దిశా నిర్దేశంలో ‘జలధార-జలహారతి’ పథకం కింద సాగునీటి శాఖ మరియు జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రణాళికాబద్ధమైన పనులతో భూగర్భ జల నిధిని పెంచే దిశగా సాగునీటి శాఖ మరియు జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు.

జిల్లాలోని సాగునీటి వనరులకు ఊపిరి పోయడంలో భాగంగా 246 చెరువుల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేసి, పనుల అమలుకు శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 48,488 నీటి సంరక్షణ నిర్మాణాలను (WC Structures) చేపట్టాలని నిర్ణయించారు. 181 ఫీడర్ ఛానల్స్, 148 (ట్యాంక్ బెడ్ల)చెరువు పూడికతీత పనులతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం రెట్టింపు అయ్యింది. 86 చెరువుల గట్లను బలోపేతం చేసి, భవిష్యత్ వరదలను తట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. 48 తూములు, 37 అలుగుల మరమ్మతులతో పాత సాగునీటి వ్యవస్థకు కొత్త జీవం పోశారు.”సాగునీటి సంఘాల బాధ్యత” నినాదంతో రైతులను ఈ యజ్ఞంలో భాగస్వామ్యం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. జిల్లాలోని 484 గ్రామాల్లో రైతు సంఘాల పర్యవేక్షణలోనే పనులు జరుగుతుండటంతో పారదర్శకతకు పెద్దపీట వేసినట్లయ్యింది.

ఉపాధికి ఆసరా – రైతుకు భరోసా
ఈ జల ధార ప్రాజెక్టును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో (MGNREGS) అనుసంధానం చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనం కలుగుతోంది. ఇప్పటికే 2180 పనులు మంజూరై వేగంగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత కూలీలకు చేతినిండా పని దొరుకుతుండగా, రైతులకు శాశ్వత సాగునీటి భరోసా లభిస్తోంది.

జలధార-జలహారతి తో జల సిరి

జలధార-జలహారతి ద్వారా పడే ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి పంపి, భవిష్యత్ తరాలకు జలనిధిని అందించడమే మా సంకల్పం. రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు జిల్లాను కరువు రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా మేము చేస్తున్న ఈ కృషికి ప్రజల సహకారం మరువలేనిది. ఇప్పటికే 1155 పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, అతి త్వరలోనే మిగిలిన పనులను కూడా పూర్తి చేసి జలసిరి తో నింపుతాం..