(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
*57 సెంటర్లలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు
*-జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, మే 13:- మే 21 వ తేది నుండి జూన్ 4వ తేది వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలను 57 సెంటర్లలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 21 వ తేది నుండి జూన్ 4 వ తేది వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలను 57 సెంటర్లలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మొదటి సంవత్సరం నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు 15,835 మంది జనరల్ విద్యార్థులు, 1815 మంది ఒకేషనల్ కోర్సు కు సంబంధించిన విద్యార్థులు మొత్తం 17,650 మంది విద్యార్థులు వ్రాస్తున్నారని, 2 వ సంవత్సరానికి సంబంధించి 7,374 మంది జనరల్ విద్యార్థులు, 775 మంది ఒకేషనల్ కోర్సు కు సంబంధించిన విద్యార్థులు మొత్తం రెండో సంవత్సరానికి 8,149 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారన్నారు, ఈ పరీక్షల నిర్వహణకు ఆయా శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. ప్రశ్న పత్రాలను ఆయా పరిధిలోని పోలీస్ స్టేషన్లో భద్రపరచడం జరుగుతుందని, ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాల వద్దకు ఎస్కార్ట్ తో తీసుకొని వెళ్లాలని, ఉదయం పరీక్షల నిర్వహణ అనంతరం ఎస్కార్ట్ తో పోస్ట్ ఆఫీస్ వద్దకు తీసుకొని వెళ్లి పోస్టల్ ద్వారా పంపించవలసి ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ వారు పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీటి సదుపాయం కల్పించాలని, పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూడాలని కలెక్టర్ మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలయ్యేలా చూడాలని, పరీక్ష కేంద్రాల నిర్వహణలో ప్లేయింగ్ స్క్వాడ్ లో ఇద్దరు రెవిన్యూ అధికారులు ఉండేలా చూడాలని కలెక్టర్ రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా సరిపడే బస్సులు సంబంధిత రూట్ లలో తిరిగేలా చూడాలని కలెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని అదే విధంగా వైద్య సిబ్బంది కూడ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్ లను మూయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, ఆర్ఐఓ లాలప్ప, కర్నూలు నగరపాలక సంస్థ అదనపు మున్సిపల్ కమిషనర్ కృష్ణ, కార్మిక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఏపీఎస్పీడీసీఎల్ డిఈ విజయ భాస్కర్, ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.