(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గురుకుల విద్యాసంస్థల ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల
ఏపీ గురుకుల విద్యాసంస్థల ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగిందని
ఏపీ గురుకుల విద్యాసంస్థల సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణమోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థల సంస్థ (APREIS) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేయడం జరిగిందన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 24న రాష్ట్రవ్యాప్తంగా APRS CAT-2026, APR JC & DC CET-2026 పరీక్షలు నిర్వహించబడ్డాయన్నారు.
ఈ ఏడాది మొత్తం 7,569 సీట్ల కోసం 76,376 మంది దరఖాస్తు చేసుకోగా, 66,300 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు.
వీటిలో
APRS CAT ప్రవేశ పరీక్షలో (5వ తరగతి): హెచ్. వర్షిత్, శ్రీ సత్యసాయి జిల్లా (96/100),మార్కులు, ఆకాష్ రెడ్డి విజయనగరం జిల్లా 97/100 మార్కులు, మోక్షిత్ శ్రీకాకుళం జిల్లా 90/100 మార్కులు, కొర్లపాటి రక్షిత ఎన్టీఆర్ జిల్లా 96/100 మార్కులు సాధించారన్నారు.
APRJC CET ప్రవేశ పరీక్షలో (MPC): కొత్తకోట మహాలక్ష్మి, విజయనగరం జిల్లా (144/150) మార్కులు,
APRJC CET (BiPC): తోలేటి బెర్నిస్ దియా, తూర్పు గోదావరి జిల్లా (145/150) మార్కులు, ఎంఇసి లో నందమూరి సాయి శశాంక్ తూర్పుగోదావరి జిల్లా 143/150 మార్కులు,
సీఈసీలో నందుపిల్లి లాస్య ప్రియ తూర్పుగోదావరి జిల్లా 141/150 మార్కులు,
ఇఇటి లో చాలమల సాయి సిద్ధార్థ తూర్పుగోదావరి జిల్లా 141/150 మార్కులు, సిజిటిలో వెల్దుర్తి మోక్షిత్ తూర్పుగోదావరి జిల్లా 139/150 మార్కులు సాధించారన్నారు.
APRDC CET ప్రవేశపరీక్షలో బిఏ గ్రూపులో కొర్ర రాజేష్, పార్వతీపురం మన్యం జిల్లా (101/150) మార్కులు, బి కామ్ లో మండల్ల అర్జునరెడ్డి పల్నాడు జిల్లా 127/150 మార్కులు,
బీఎస్సీ కెమిస్ట్రీలో చిప్పాడ వరుణ్ సాయి తేజ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 112/150మార్కులు,
బీఎస్సీ (డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్) లో నోడగాన జై కిరణ్ పార్వతిపురం మన్యం జిల్లా 109/150 మార్కులు, బిఎస్సి (జువాలజీ)లో మత్తూర్తి లక్ష్మీ సూర్యకాంత్ విశాఖపట్నం జిల్లా 79/150 మార్కులు సాధించారన్నారు.
ఫలితాల కోసం విద్యార్థులు తమ ఐడి ద్వారా https://aprs.apcfss.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చునని తెలిపారు.
ఎంపికైన విద్యార్థుల జాబితా మరియు కౌన్సెలింగ్ వివరాలను పాఠశాలలకు ఈనెల 13న పంపడం జరుగుతుందన్నారు.
జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి జరపే కౌన్సిలింగ్ తేదీలు, ప్రదేశము, అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను ఈనెల 13వ తేదీన ప్రకటించడం జరుగుతుందని అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా తెలుసుకోగలరన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు IIT/JEE, NEET, CA/CMA, NDA, CDS, RRB వంటి పోటీ పరీక్షలకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ప్రత్యేక కోచింగ్ ఇవ్వబడుతుందని
ఏపీ గురుకుల విద్యాసంస్థల సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణమోహన్ ఆ ప్రకటనలో తెలిపారు.