Tenth, Inter Results 2025: ఏపీ పదో తరగతి, ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..
Tenth, Inter Results 2025: ఏపీ పదో తరగతి, ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..
Tenth, Inter Results 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా వ్యాప్తంగా పది, ఇంటర్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కావడంతో లక్షలాది మంది విద్యార్థులు ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏపీ ఇంటర్ రిజల్ట్స్ అప్పుడే..
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏప్రిల్ 12-15 తేదీల మధ్య ఇంటర్ ఫలితాలను(AP Inter Results) విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీల మధ్య ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫలితాలను కంప్యూటరీకరణ చేసేందుకు 5-6 రోజుల సమయం పడుతుంది. ఈ సంవత్సరం టెన్త్, ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల చేసినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. వాట్సాప్ నంబర్ 9552300009 లేదా BIEAP అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.
ఏపీ పది ఫలితాల అప్డేట్..
ఏపీలో పదోతరగతి పరీక్షలు మార్చి 17 నుంచి మొదలై మార్చి 31న పూర్తయ్యాయి. ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షా ఫలితాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్ఢు స్థాయిలో 7 రోజుల్లోనే అంటే ఏప్రిల్ 9లోగా మూల్యాంకనం పూర్తి చేసేందుకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అనుకున్నట్టే జరిగితే ఈ నెల చివరి వారంలో ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలవుతాయి లేదంటే మే తొలివారంలో రిలీజ్ చేసే అవకాశముంది. ఏపీ పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు వాట్సాప్ నెంబర్ 9552300009 లేదా అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.