Slot booking: రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి.. పూర్తి వివరాలు
Slot booking: రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి.. పూర్తి వివరాలు
డిజిటల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ (DQMS) - స్లాట్ బుకింగ్
డిజిటల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ (DQMS)ను 10-03-2025న కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక ప్రాథమిక కార్యక్రమంగా ప్రారంభించాం. ప్రజల నుండి మరియు ఇతర భాగస్వాముల నుండి వచ్చిన అమూల్యమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఈ వ్యవస్థను మరింత మెరుగుపరిచాం.
స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి:
• పబ్లిక్ డేటా ఎంట్రీ (PDE) సిస్టమ్ ద్వారా
• అధికారికవెబ్సైట్: registration.ap.gov.inలోని స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా
• QR కోడ్ స్కాన్ చేసి ఇది ప్రతిసబ్-రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో అందుబాటులో ఉంటుంది.
ప్రజలకు లాభాలు:
• వెయిటింగ్ టైమ్ తగ్గుతుంది : ప్రజలు ముందే వారి అపాయింట్మెంట్ తేది మరియు సమయాన్ని బుక్ చేసుకోవచ్చు, దీని ద్వారా క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది.
• సౌకర్యవంతమైనప్రణాళిక : కొనుగోలుదారులు, అమ్మకందారులు మరియు సాక్ష్యులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమును సందర్శన సమయము ముందుగానే ప్రణాళికతో నిర్వహించవచ్చు.
• పారదర్శకత : రిజిస్ట్రేషన్ పక్రియ సమయపాలనతో కూడినది మరియు క్రమబద్ధమైనదిగా మారుతుంది.
• మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుంది: స్లాట్ ఆధారిత అపాయింట్మెంట్లు అనధికారిక కార్యకలాపాలను తగ్గిస్తాయి.
• సిబ్బంది నిర్వహణ సులభతరం : రోజువారీరిజిస్ట్రేషన్లపై ఆధారపడి వనరులను సమర్థంగా ప్రణాళికబద్ధంగా చేయవచ్చు.
• దస్తావేజులు ముందస్తు పరిశీలన : తిరస్కరణలు మరియు పునః సందర్శన అవసరాలు తగ్గుతాయి.
• సురక్షితమైన మరియు సంపర్కరహిత విధానం: కోవిడ్ అనంతరం ఆరోగ్య భద్రత మరియు డిజిటల్ పాలనకు ఇది మరింత శ్రేయస్కరం.
అందుబాటులోఉండేకార్యాలయాలు:
• 2025 ఏప్రిల్ 4వ తేదీ నుంచి రాష్ట్రములోని మొత్తం 26 జిల్లా ప్రధాన కార్యాలయాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలలోఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
• మొత్తం 296 సబ్ - రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ను దశల వారీగా విస్తరించబడుతుంది. ఈ కార్యక్రమం ప్రజలకు సులభమైన రిజిస్ట్రేషన్ సేవలను అందించడంలో సహాయపడుతుంది. మనం వేగవంతమైన, పారదర్శకమైన మరియు ఇబ్బందులు లేని రిజిస్ట్రేషన్ సేవల దిశగా అడుగులు వేయాలసిన సమయం ఇది!