రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Railway jobs: గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ పూర్తి సమాచారం

Rrb job notifications RRB ALP Recruitment 2025 RRB ALP Notification Latest Railway jobs RRB recruitments news www.rrbcdg.gov.in indianrailways.gov.in
Peoples Motivation

Railway jobs: గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ పూర్తి సమాచారం


నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత, ప్రాంతం, దరఖాస్తు వివరాలు, జోన్ వారీ ఉన్న ఖాళీలను తెలుసుకుందాం..

Rrb job notifications RRB ALP Recruitment 2025 RRB ALP Notification Latest Railway jobs RRB recruitments news www.rrbcdg.gov.in indianrailways.gov.in

దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతీ యువకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RRB అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఏప్రిల్ 10, 2025న ప్రారంభం కాబోతుంది. భారతదేశంలోని వివిధ RRB జోన్‌లలో మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీల కోసం ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ మే 11, 2025. 

ఆర్ఆర్బీ 9970 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


ఆర్ఆర్బీ రీజియన్స్ (RRB REGIONS): 

సికింద్రాబాద్‌, చెన్నై, తిరువనంతపురం, భువనేశ్వర్, బెంగళూరు, భోపాల్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, గోరఖ్‌పూర్, అహ్మదాబాద్, అజ్‌మేర్.

ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా పోస్టుల వివరాలు: 

  • సికింద్రాబాద్- 1,500
  • చెన్నై- 362
  • ముంబయి- 740
  • భువనేశ్వర్- 928
  • రాంచీ- 1,213
  • కోల్‌కతా- 720
  • తిరువనంతపురం- 148
  • అహ్మదాబాద్- 497
  • అజ్‌మేర్- 820
  • ప్రయాగ్‌రాజ్‌- 588
  • భోపాల్‌- 664
  • బిలాస్‌పూర్- 568
  • చండీఘడ్‌- 433
  • గువాహటి- 30
  • జమ్ము అండ్‌ శ్రీనగర్- 08
  • మాల్దా- 432
  • ముజఫర్‌పూర్- 89
  • పట్నా- 33
  • ప్రయాగ్‌రాజ్- 286
  • సిలిగురి- 95
  • గోరఖ్‌పూర్- 100
  • మొత్తం ఖాళీల సంఖ్య: 9,970

ట్రేడ్ విభాగాలు:

ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్రైట్/ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ (రేడియో/టీవీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ (మోటార్ వెహికల్), వైర్మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్ (డీజిల్), హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్


విద్యార్హతలు (Qualifications): 

అభ్యర్థులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాస్ అయ్యుండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీంగ్ల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.


వయోపరిమితి (Age Limit):

అభ్యర్థుల వయస్సు 2025 జులై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు రుసుము (Application Fee): 

• జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. వీరికి CBT 1 పరీక్ష రాసిన తర్వాత రూ. 400 తిరిగి ఇవ్వబడుతుంది.

• ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. వీరికి CBT 1 పరీక్ష రాసిన తర్వాత పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.


ఎంపిక విధానం (Selection Process): 

• CBT 1 (క్వాలిఫైయింగ్)

• CBT 2 (CBAT కోసం షార్ట్‌లిస్ట్ చేయడానికి)

• CBAT (కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ - తుది మెరిట్ కోసం తప్పనిసరి). చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఎంపిక చేస్తారు.


జీతభత్యాలు (Salary): 

అసిస్టెంట్ లోకో పైలట్లకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతభత్యాలు ఉంటాయి.


దరఖాస్తు విధానం (Application Process):

• అభ్యర్థులు ముందుగా ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ https://indianrailways.gov.in/ ఓపెన్ చేయాలి.

• ఆర్ఆర్బీ వెబ్సైట్లో మీ పేరు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ తదితర వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

• అప్పుడు మీ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది.

• మీరు మరలా పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి.

• రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్లి RRB ALP Recruitment 2025 లింక్పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.

• అప్లికేషన్లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.

• అవసరమైన పత్రాలు అన్నీ అప్లోడ్ చేయాలి.

• అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.

• వివరాలు అన్నీ మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

• భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు (Important Dates):

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2025 ఏప్రిల్ 12

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2025 మే 11

దరఖాస్తుల సవరణ తేదీలు: 2025 మే 14 నుంచి 23 వరకు

హాల్ టికెట్లు విడుదల తేదీ: ఇంకా ప్రకటించలేదు

పరీక్ష తేదీలు: త్వరలో ప్రకటించబడతాయి.

మిగతా సమాచారం అధికారిక వెబ్‌సైట్ https://www.rrbcdg.gov.in/ లో చూడవచ్చు.

Comments

-Advertisement-