RRB ALP నోటిఫికేషన్ 2025 విడుదల
RRB ALP నోటిఫికేషన్ 2025 విడుదల
ఐటీఐ, డిప్లొమాలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 24 మార్చి 2025న, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 9900 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల ఖాళీల కోసం RRB ALP రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ (CEN నం. 1/2025)ను ఉపాధి వార్తాపత్రిక ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..
ఆర్ఆర్బీ 9900 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్ఆర్బీ రీజియన్స్:
ప్రస్తుత నియామక ప్రక్రియలో జోన్ల వారీగా మొత్తం 9,900 ALP పోస్టుల ఖాళీలు ఉన్నాయి. వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
సెంట్రల్ రైల్వే – 376 పోస్టులు
తూర్పు మధ్య రైల్వే – 700 పోస్టులు
నార్త్ సెంట్రల్ రైల్వే – 508 పోస్టులు
నార్త్ ఈస్టర్న్ రైల్వే – 100 పోస్టులు
ఈశాన్య సరిహద్దు రైల్వే – 125 పోస్టులు
ఉత్తర రైల్వే – 521 పోస్టులు
నార్త్ వెస్ట్రన్ రైల్వే – 679 పోస్టులు
సౌత్ సెంట్రల్ రైల్వే – 989 పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే – 568 పోస్టులు
సౌత్ ఈస్టర్న్ రైల్వే – 921 పోస్టులు
దక్షిణ రైల్వే – 510 పోస్టులు
వెస్ట్ సెంట్రల్ రైల్వే – 759 పోస్టులు
వెస్ట్రన్ రైల్వే – 885 పోస్టులు
మెట్రో రైల్వే కోల్‌కతా – 225 పోస్టులు
ట్రేడ్ విభాగాలు
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్రైట్/ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ (రేడియో/టీవీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ (మోటార్ వెహికల్), వైర్మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్ (డీజిల్), హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్
విద్యార్హతలు (Qualifications):
అభ్యర్థులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాస్ అయ్యుండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీంగ్ల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.
వయోపరిమితి (Age Limit):
అభ్యర్థుల వయస్సు 2024 జులై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము (Application Fee):
జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ (Selection Process):
అభ్యర్థులకు స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు (Salary):
అసిస్టెంట్ లోకో పైలట్లకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతభత్యాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం (Application Process):
- అభ్యర్థులు ముందుగా ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ https://indianrailways.gov.in/ ఓపెన్ చేయాలి.
- ఆర్ఆర్బీ వెబ్సైట్లో మీ పేరు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ తదితర వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- అప్పుడు మీ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది.
- మీరు మరలా పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి.
- రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్లి RRB ALP Recruitment 2025 లింక్పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.
- అప్లికేషన్లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలు అన్నీ అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- వివరాలు అన్నీ మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు (Important Dates):
దరఖాస్తు ప్రారంభ తేదీ:10 ఏప్రిల్ 2025 నుంచి
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 9 మే 2025 వరకు
దరఖాస్తు సవరణ తేదీ: ఇంకా ప్రకటించలేదు
హాల్ టికెట్లు విడుదల తేదీ: ఇంకా ప్రకటించలేదు
పరీక్ష తేదీలు: త్వరలో ప్రకటించబడతాయి.