రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

RRB: ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ.. నాలుగో దశలో 28కి ఆర్‌ఆర్‌బీల కుదింపు

ANDHRA PRADESH GRAMEENA BANK APGB AP GRAMEENA BANK Rural banks in india Regional Rural banks list List of rural banks Regional Rural banks in India
Peoples Motivation

RRB: ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ.. నాలుగో దశలో 28కి ఆర్‌ఆర్‌బీల కుదింపు 

ANDHRA PRADESH GRAMEENA BANK APGB AP GRAMEENA BANK Rural banks in india Regional Rural banks list List of rural banks Regional Rural banks in India

RRB: ఒకే రాష్ట్రం ఒక ఆర్‌ఆర్‌బీ విధానం ఈ ఏడాది మే ఒకటి నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాంతో 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ బ్యాంకులను (RRB) కన్సాలిడేట్‌ చేయనున్నది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ సహా 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణకు సంబంధించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

ఒకే రాష్ట్రం ఒక ఆర్‌ఆర్‌బీ విధానం ఈ ఏడాది మే ఒకటి నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాంతో 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ బ్యాంకులను (RRB) కన్సాలిడేట్‌ చేయనున్నది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ సహా 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణకు సంబంధించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇది పూర్తయితే ఈ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనున్నది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2004-05 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఆర్‌బీల నిర్మాణాత్మక ఏకీకరణను మొదలుపెట్టింది. ఇందులో ఇప్పటి వరకు మూడు దశల్లో 2020-21 నాటికి ఆర్‌ఆర్‌బీల సంఖ్య 196 నుంచి 43కి తగ్గింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు చట్టం-1976లోని సెక్షన్ 23A (1) ప్రకారం, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న ఆర్‌ఆర్‌బీలు ఒకే సంస్థగా మారనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా..

ఆంధ్రప్రదేలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లు.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ విలీనం చేయబడి.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా మారతాయి. కొత్త బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో అమరావతిలో ఉండనుండగా.. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పాన్సర్‌ చేయనున్నది. యూపీలోని బరోడా యూపీ బ్యాంక్‌, ఆర్యవర్ట్ బ్యాంక్, ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంక్ ఉత్తర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో విలీనవుతాయి. ప్రధాన కార్యాలయం బ్యాంక్ ఆఫ్ బరోడా స్పాన్సర్‌షిప్ కింద లక్నోలో ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో, బంగియా గ్రామీణ వికాస్, పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్, ఉత్తరబంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ విలీనం చేయబడి పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్‌గా మారుతాయి.

ఎనిమిది రాష్ట్రాల్లో విలీనం..

ఇదే తరహాలో మిగతా ఎనిమిది రాష్ట్రాల్లోనూ ఆర్‌ఆర్‌బీలు విలీనమవుతాయి. ఆర్‌ఆర్‌బీలో కేంద్రానికి 50శాతం వాటా ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు స్పాన్సర్ వాటా 35శాతం, రాష్ట్రాలకు 15శాతం ఉంటుంది. సవరించిన చట్టం ప్రకారం.. వాటాను తగ్గించిన తర్వాత కూడా.. కేంద్రం, స్పాన్సర్ బ్యాంకుల వాటా 51శాతం కంటే తక్కువ ఉండకూడదు. బ్యాంకులకు రూ.2వేల కోట్ల మూలధనం ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం, అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ.2వేల కోట్ల అధీకృత మూలధనం ఉంటుంది. ఇదిలా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, కళాకారులకు రుణాలు, ఇతర బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు ఆర్‌ఆర్‌బీ యాక్ట్‌ కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్రానికి 50శాతం, స్పాన్సర్‌ బ్యాంకులకు 30శాతం, రాష్ట్ర ప్రభుత్వాలకు 15శాతం వాటా ఉంటుంది. ప్రస్తుతం 26 రాష్ట్రంలో 43 ఆర్‌ఆర్‌బీలు ఉండగా.. ఈ సంఖ్య 28 తగ్గుతుంది.

గత విలీనాల వల్ల పనితీరు మెరుగు..

గత విలీనాల వల్ల పనితీరు మెరుగైనట్లు గుర్తించడంతో 2024 నవంబరులో తాజా విలీన ప్రణాళికను ప్రకటించిన ఆర్థిక మంత్రిత్వశాఖ, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులను ఏర్పాటు చేసింది. సంప్రదింపుల అనంతరం పది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 26 ఆర్ఆర్బీల విలీన ప్రక్రియను పూర్తి చేశారు. సామర్థ్య పెంపు, ఖర్చు హేతుబద్ధీకరణ ఈ విలీనాల ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం 26 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 43 ఆర్ఆర్బీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విలీన ప్రక్రియ తుది దశ పూర్తయితే 26 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 700 జిల్లాల్లో 22,000 శాఖలతో మొత్తం 28 ఆర్ఆర్బీలు పనిచేస్తాయి. ప్రాథమికంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే ఈ బ్యాంకులు, గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లో 92 శాతం శాఖలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం చేపట్టిన విలీనాలు నాలుగో దశకి చెందినవి. తొలి దశలో (2006-2010 ఆర్థిక సంవత్సరాల కాలం) ఆర్ఆర్బీల సంఖ్య 196 నుంచు 82కు, మలి దశలో (2013-2015 ఆర్థిక సంవత్సరాల కాలం) 82 నుంచి 56కు, మూడో దశలో (2019-2021 ఆర్థిక సంవత్సరాల కాలం) 56 నుంచి 43కు వీటి సంఖ్యను కుదించారు.

Comments

-Advertisement-