రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Ration Card: ఇలా క్షణాల్లో మీ రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోండి

How to Check Ration Card Status FSC APPLICATION STATUS TG RATION CARD STATUS PROCESS RATION CARD STATUS IN PHONE NEW RATION CARD APPLICATION STATUS
Peoples Motivation

Ration Card: ఇలా క్షణాల్లో మీ రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోండి

- కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారా?

- మీ వాళ్ల పేర్లు నమోదయ్యాయా లేదా?

- ఒక్క క్లిక్తో మీ ఫోన్లోనే వివరాలు!

- మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా? 

- ఇలా క్షణాల్లో మీ కార్డు స్టేటస్ తెలుసుకోండి!

How to Check Ration Card Status FSC APPLICATION STATUS TG RATION CARD STATUS PROCESS RATION CARD STATUS IN PHONE NEW RATION CARD APPLICATION STATUS

ఆధార్ తర్వాత అత్యంత కీలకమైన కార్డు ఏది? అంటే అందరూ చేప్పే పేరు "రేషన్ కార్డు". ఇది కేవలం రేషన్ సరుకులు మాత్రమే అందించే కార్డు కాదు. అంతకు మించి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ధ్రువీకరణ పత్రం. ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికే తొలి ప్రాధాన్యం ఇస్తాయి. అలాంటి గుర్తింపును అందించే మొదటి సాధనం రేషన్ కార్డు.

కేవలం కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా పాత కార్డులలో పేర్లు యాడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. అయితే, కొత్త రేషన్ కార్డుల కోసం అందరూ దరఖాస్తు చేసుకుంటున్నారు కానీ, దాని స్టేటస్ ఏంటి? అప్రూవ్ లేదా రిజెక్ట్ అయ్యిందా? అనే విషయం చాలా మందికి తెలియడం లేదు. దీంతో ఆ వివరాలు తెలుసుకునేందుకు మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారు ఇకపై జస్ట్ ఒక్క క్లిక్తో కేవలం ఇంట్లో నుంచే మీ రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కొత్త పేర్లు యాడ్ అయ్యాయో? లేదో కూడా తెలుసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ చూద్దాం ఓసారి...

రేషన్ కార్డు కోసం మార్గదర్శకాలు: 

నూతన రేషన్ కార్డు కావాల్సిన వారు గతంలో మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లే వారు. ఇప్పుడు కూడా చాలా మంది కొత్త కార్డుకోసం దరఖాస్తు చేసుకునేందుకు తహశీల్దార్ కార్యాలయానికే వెళ్తున్నారు. కానీ, మీసేవా కేంద్రానికి వెళ్లాలి. మీ సేవ కేంద్రంలో కేవలం రూ.45 చెల్లించి అప్లై చేసుకోవాలి. ఇంతకు మించి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కార్డు ఇప్పించాలని మధ్యవర్తులు ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం కూడా లేదని, వారికి డబ్బులు కూడా ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల "మీ సేవ"లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది. మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత సంబంధిత అధికారులు, సిబ్బంది మీ చిరునామాకు వస్తారు. మీ అర్హతా వివరాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ పరిశీలనకు వెళ్తుంది.

దరఖాస్తుకు ఏమేం కావాలి?

కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారికి తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి. కుటుంబ సభ్యులందరికీ తప్పని సరి. ఆధార్ ద్వారానే మీ స్థానికతను ధ్రువీకరించే అవకాశం ఉంది. అదేవిధంగా నివాసం కరెంటు బిల్లు, లేదంటే నీటి బిల్లు, లేదంటే గ్యాస్ కనెక్షన్ బిల్లు సమర్పించాల్సి ఉంటుంది.

రోజూ ఈ సమయంలోనే

కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను మీ సేవ కేంద్రాల్లో ప్రతిరోజూ పొద్దున 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు తీసుకుంటారు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం తుది గడువును ప్రభుత్వం నిర్ణయించలేదు. కానీ, సాధ్యమైనంత త్వరగా అప్లికేషన్ చేసుకుంటేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది

అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి:

• ముందుగా మీ ఫోన్లో తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. https://epds.telangana.gov.in/FoodSecurityAct/

• స్క్రీన్ మీద Ration Card Search అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే FSC Search, FSC Application Search, Status of Rejected Ration Card Search ఆఫ్షన్లు కనిపిస్తాయి. అందులో FSC Application Search మీద క్లిక్ చేయాలి.

• అప్పుడు మీ-సేవా అప్లికేషన్ సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది.

• అందులో ముందుగా జిల్లా సెలెక్ట్ చేసుకుని, Mee Seva No బాక్స్పై క్లిక్ చేయాలి.

• ఆ అప్లికేషన్ నెంబర్ బాక్సులో దరఖాస్తు సమయంలో ఇచ్చిన మీ సేవ రసీదులోని అప్లికేషన్ నెంబర్ను ఎంటర్ చేసి Search బటన్ క్లిక్ చేయాలి.

• మీ అప్లికేషన్‌కు సంబంధించిన స్టేటస్ వివరాలు కింద కనిపిస్తాయి. Apporved అని ఉంటే మీకు రేషన్ కార్డు వచ్చినట్లే. ఒకవేళ Pending అని ఉంటి మరికొంచెం సమయం పడుతుంది.

• ఒకవేళ ఎవరిదైన రేషన్ కార్డు రిజెక్ట్ అయితే దాని స్టేటస్ తెలుసుకునేందుకు Status of Rejected Ration Card మీద క్లిక్ చేసి రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు అందుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.


రేషన్ కార్డుల్లో పేర్లు యాడ్ అయ్యాయో తెలుసుకునేందుకు:

• ముందుగా తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. https://epds.telangana.gov.in/FoodSecurityAct/

• స్క్రీన్ మీద Ration Card Search అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే FSC Search, FSC Application Search, Status of Rejected Ration Card Search ఆఫ్షన్లు కనిపిస్తాయి.

• అందులో FSC Search మీద క్లిక్ చేయాలి.

• ఆ పేజీలో FSC Ref No లేదా రేషన్ కార్డ్ లేదా పాత రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి.

• అప్పుడు స్క్రీన్ మీద మీ రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వాటిని బట్టి అందులో పేర్లు యాడ్ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు.

Comments

-Advertisement-