రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

RAJIV YUVA VIKASAM: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు కీలక సూచన.. ఆ సర్టిఫికేట్ అవసరం లేదు!

RAJIV YUVA VIKASAM SCHEME TGOBMMS tgobmms.cgg.gov.in apply Rajiv yuva vikasam scheme official website Rajiv yuva vikasam details tgobmms.cgg.gov.in
Mounikadesk

RAJIV YUVA VIKASAM: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు కీలక సూచన.. ఆ సర్టిఫికేట్ అవసరం లేదు!

• రాజీవ్ యువ వికాసం పథకం..

• ఆ సర్టిఫికేట్ అవసరం లేదు..

• ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పని లేదు..

• ఆ కార్డు ఉంటే చాలు..

RAJIV YUVA VIKASAM SCHEME TGOBMMS tgobmms.cgg.gov.in apply Rajiv yuva vikasam scheme official website Rajiv yuva vikasam details  tgobmms.cgg.gov.in

Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు స్పష్టం చేశారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల్లో భారీగా దరఖాస్తులు అందుతున్న నేపథ్యంలో బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు స్పష్టత ఇచ్చారు.

మీసేవ కేంద్రాల ద్వారా 2016 తర్వాత తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుందని, మళ్లీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదని మల్లయ్య బట్టు తెలిపారు. మండల, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తులను నింపి ప్రజా పాలన కేంద్రాల్లో సమర్పించాలని బీసీ కార్పొరేషన్ ఎండీ తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటి వరకు 7లక్షల దరఖాస్తులు వచ్చినట్లు బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు వెల్లడించారు.

3 క్యాటగిరీలుగా రుణాలు: 

తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ వరకు రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల గడువును పొడిగించింది. రాజీవ్‌ యువ వికాసం స్కీమ్ కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 క్యాటగిరీలుగా విభజించింది. క్యాటగిరీ-1 కింద రూ.లక్ష వరకు లోన్ను అందిస్తుంది. అందులో 80 శాతం రాయితీ ఉంటుంది. క్యాటగిరీ-2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు లోన్లను మంజూరు చేస్తుంది. అందులో 70 శాతం రాయితీని కల్పిస్తుంది. క్యాటగిరీ-3 కింద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలను అందజేయనుండగా అందులో 60 శాతం రాయితీ కల్పిస్తారు.

14 వరకు ఆఫ్లైన్లో దరఖాస్తుల స్వీకరణ: 

 ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వరుసగా సెలవులు రావడం, కుల, ఆదాయ ధ్రువపత్రాలు సకాలంలో రాక ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. ఆన్లైన్ ధరఖాస్తులు సమర్పించలేని వారి కోసం బల్దియా కార్యాలయంలో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన దరఖాస్తు పత్రాలను పూరించి, అవసరమైన సర్టిఫికెట్లను జోడించి కేంద్రాలలో అందజేయాలి. అనంతరం అధికారులు దరఖాస్తులను క్రోడీకరించి ఆన్లైన్ చేయనున్నారు.

Comments

-Advertisement-