NCRTCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి సమాచారం
NCRTCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి సమాచారం
• నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఉద్యోగాలు..
• 72 జూనియర్ ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
• అర్హతలు, జీతం ఎంతో తెలుసా?
ఇంజినీరింగ్ నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(NCRTC)లో ఉద్యోగ ప్రకటన వెలువడింది. 72 జూనియర్ ఇంజినీర్ పోస్టులను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. జీతం, విద్యార్హతలు, ఏఏ విభాగంలో ఎన్ని పోస్టులు, ఫీజులు, వయసు వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
విభాగాల వారీగా ఖాళీలు
జూనియర్ ఇంజినీర్(JE)(ఎలక్ట్రికల్) - 16
జేఈ(ఎలక్ట్రానిక్స్) -16
జేఈ(మెకానికల్) -3
జేఈ (సివిల్)-1
ప్రోగ్రామ్ అసోసియేట్-4
అసిస్టెంట్ (హెచ్‌ఆర్)-3
అసిస్టెంట్ (కార్పొరేట్ హాస్పిటాలిటీ)-1
జూనియర్ మెయింటెయినర్ (ఎలక్ట్రికల్)-18
జూనియర్ మెయింటెయినర్ (మెకానికల్)-10
అర్హతలు
• జూనియర్ ఇంజినీర్ పోస్టులకు ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ సివిల్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ ఇంజినీరింగ్ డిప్లొమా/ బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ (ఐటీ) పూర్తిచేయాలి.
• అసిస్టెంట్ (హెచ్‌ఆర్) పోస్టుకు బీబీఏ/ బీబీఎం
• అసిస్టెంట్ (కార్పొరేట్ హాస్పిటాలిటీ) పోస్టుకు హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ/ తత్సమాన పరీక్ష పాసైతే చాలు
• జూనియర్ మెయింటెయినర్ పోస్టుకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ (ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ)
• జూనియర్ మెయింటెయినర్ (మెకానికల్) పోస్టుకు ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ (ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ). (ఈ రెండు పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు అనర్హులు.)
• ఫుల్‌టైమ్ రెగ్యులర్ కోర్సులు చేసినవారు, 23.03.2025 నాటికి తగిన విద్యార్హతలు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.
వయసు
25 సంవత్సరాలు మించకూడదు.
(ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్), మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.)
వేతనం
ఇంజినీర్ పోస్టులకు నెలకు రూ.22,800-75,850
అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.20,250-65,500
జూనియర్ మెయింటెయినర్ పోస్టులకు నెలకు రూ.18,250-59,200 (మూలవేతనానికి అదనంగా వీడీఏ, హెచ్‌ఆర్‌ఏ, పెర్క్స్ అండ్ అలవెన్సులు, ఇతర సదుపాయాలు ఉంటాయి.)
ఎంపిక విధానం (Selection Process)
• కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)
• వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక
• సీబీటీ సిలబస్‌ను ఎన్‌సీఈఆర్‌టీసీ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
పరీక్ష విధానం
ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది.
ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. నెగటివ్ మార్కులు లేవు.
సీబీటీని ఇంగ్లిష్ లేదా హిందీలో రాసే అవకాశం ఉంటుంది.
సీబీటీ వ్యవధి 90 నిమిషాలు.
సీబీటీలో కనీసార్హత మార్కులు సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు.
ఎంపికైనవారికి రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్, కోల్కతా, ముంబయి, భోపాల్, అహ్మదాబాద్, లఖ్నవూ, దిల్లీ-ఎన్సీఆర్. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఒక కేంద్రాన్ని ఎంచుకోవాలి. (ఆన్లైన్ దరఖాస్తు చేసిన తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం లేదు)
దరఖాస్తు ఫీజు:
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్‌రిజర్వుడ్, మాజీ సైనికోద్యోగులకు రూ.1,000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ
24.04.2025(అడ్మిట్‌కార్డును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.)
వెబ్‌సైట్: www.ncrtc.in