Model Schools: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Model Schools: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పేద విద్యార్థులకు కార్పొ రేట్ స్థాయి విద్య అందించాలన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల భాగస్వామ్యంతో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశారు. వాటిలో ప్రవేశాలు పొందడానికి ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోవచ్చు..
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసు కున్న ధ్రువ పత్రాలను పాఠశాలల్లో అందజేయాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 20న పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్కు మెరిట్ పద్ధతిలో రిజర్వేషన్ ప్రకారం జూన్ 6న ఎంపికైన విద్యా ర్థుల జాబితాను ప్రకటిస్తారు.
చేయాలిలా..!
6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు apms.apcfs.in అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసు కోవాలి. ఆరో తరగతి పూర్తయ్యాక ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీల కోసం
కేటగిరీల వారీగా..
ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతితో దరఖాస్తులు చేసు కునే వారికి కేటగిరీల వారిగా విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులకు రూ.75, బీసీ, ఓసీ విద్యార్థులు రూ.150 చెల్లించాలి. ఇంటర్మీడియట్లో చేర డానికి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.150 దరఖాస్తు రుసుం చెల్లించాలి.