KGBV: బాలికలకు మాత్రమే ప్రవేశాలు.. దరఖాస్తు చేద్దాం ఇలా
KGBV: బాలికలకు మాత్రమే ప్రవేశాలు.. దరఖాస్తు చేద్దాం ఇలా
సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి గానూ 6, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం మార్చి 22 నుండి ఏప్రిల్ 11 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( బడి మానేసిన వారు) పేద, ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, బి.పి.ఎల్. బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి
• గూగూల్ ఓపెన్ చేసి apkgbv.apcfss.in అని టైప్ చేయాలి.
• చేరబోయే తరగతి వారీగా (6వ తరగతి విడిగా; 7,8,9,10 విడిగా; 11 విడిగా, 12 విడిగా) అప్లికేషన్ ఫారం లాగిన్ అవ్వాలి.
• లాగిన్ పై విద్యార్థిని ఆధార్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి క్యాప్చా టైప్ చేయాలి.
• అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
• ఒక్కసారి ఆధార్ నమోదు చేసిన తర్వాత కొత్త అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలుకాదు.
• విద్యార్థికి కావలసిన తరగతిని ఎంపిక చేయాలి.
దరఖాస్తుకు సిద్ధం చేసుకోవాల్సిన వివరాలు:
1) విద్యార్థి ఆధార్ నంబర్
2) తల్లి, తండ్రి లేదా సంరక్షకులు ఆధార్ నంబర్
3) ఫోన్ నంబర్ నంబర్
4) Cast certificate, income certificate
5) రేషన్ కార్డు
• చైల్డ్ ఇన్ఫో నంబర్ (ప్రస్తుతం చదువుతున్న పాఠశాల హెచ్ఎం గారి దగ్గర తీసుకోవాలి)
నమోదు చేయాల్సిన వివరాలు
లాగిన్ ఓపెన్ అయిన తర్వాత మీరు చేరాల్సిన తరగతి జాగ్రత్తగా సరిచూసుకోవాలి
• ఆధార్ నంబరు టైప్ చేయాలి.
• విద్యార్థిని పేరు, ఇంటి పేరు,
• తల్లి లేదా తండ్రి ఫోన్ నంబరు
• చైల్డ్ ఇన్పో నంబర్
• పిన్ కోడ్
• తండ్రి పేరు, ఆధార్ నంబర్
• తల్లి పేరు, ఆధార్ నంబర్
• తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల వృత్తి
• వార్షిక ఆదాయం
• రేషన్ కార్డు నంబర్
• కులం, ఉపకులం
• మతం
• పూర్తి చిరునామా
• విద్యార్థిని గత రెండేళ్ల చదువు వివరాలు
• చేరాలనుకుంటున్న కేజీబీవీ వివరాలు ఎంపిక చేసుకోవాలి
• 3.5 సెం.మీ (వెడల్పు), 4.5 సెం.మీ (పొడవు) తో విద్యార్థిని పాస్ పోర్టు సైజ్ ఫొటో అప్ లోడ్ చేయాలి.
• డిక్లరేషన్ టిక్ పెట్టి ఒకసారి ప్రివ్యూ ఫారం క్షుణ్ణంగా చూసుకొని సబ్మిట్ చేయాలి.
• దరఖాస్తు చేసుకోవడం రానివారు స్థానిక నెట్ సెంటర్ లేదా దగ్గర్లో ఉన్న కేజీబీవీ ప్రిన్సిపాల్ ను సంప్రదించి అప్లయ్ చేసుకోవచ్చు.
• దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏవైనా సందేహాలు వస్తే kgbv.samagra@gmail.com కు మెయిల్ చేయగలరు.
• రెండు రోజుల్లో అదే మెయిల్ కు రిప్లయ్ ఇవ్వడం జరుగుతుంది.
• ఏవైనా సమస్యలు, సందేహాలకు 70751 59996, 70750 39990 ఈ నంబర్లు సంప్రదించవచ్చు.