Jobs: ఎయిమ్స్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
Jobs: ఎయిమ్స్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
ఆల్ ఇండియా ఇన్‌ఇడియన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), న్యూదిల్లీ ఒప్పంద/ శాశ్వత ప్రాతిపదికన 199 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
◆ ప్రొఫెసర్ అడిషనల్ ప్రొఫెసర్
◆ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, సర్జరీ, మెడిసిన్, న్యూరాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ తదితరాలు.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత అనుబంధ డీఎన్‌బీ, ఎండీఎస్, ఎంఎస్, ఎండీ, బీసీహెచ్, డీఎంతో పాటు పని అనుభవం.
వయసు: ప్రొఫెసర్ కు 70 ఏళ్లు; ఇతర పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడు, పీడబ్ల్యూబీడీకి పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.3,000, ఎస్సీ/ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌కు రూ.2400, దివ్యాంగులకు ఫీజు ఉండదు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వూలతో.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 10-04-2025.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-05-2025.