రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Inter results: ఇంటర్‌ ఫలితాలు విడుదల

INTERMEDIATE RESULTS 2025 AP INTERMEDIATE RESULTS AP INTERMEDIATE RESULTS ON APRIL 12 INTERMEDIATE RESULTS UPDATE resultsbie.ap.gov.in AP INTER RESULT
Peoples Motivation

Inter results: ఇంటర్‌ ఫలితాలు విడుదల

INTERMEDIATE RESULTS 2025 AP INTERMEDIATE RESULTS AP INTERMEDIATE RESULTS ON APRIL 12 INTERMEDIATE RESULTS UPDATE resultsbie.ap.gov.in AP INTER RESULT

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్‌ ఫలితాలు విడుదల resultsbie.ap.gov.in లో చూడవచ్చు. లేదంటే ఎంతో సింపుల్గా వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు Hi మెసేజ్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. తద్వారా ఫోన్లోనే రెండే రెండు నిమిషాల్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.

• మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 కు Hi మెసేజ్ చేయాలి.

• తరువాత మనకు సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.

• అందులో మనకు కావలసిన విద్య సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

• అందులో ఇంటర్మీడియట్ ఫలితాలు అనే కాలమ్ ఉంటుంది.

• దానిని సెలక్ట్ చేసుకుని, నిర్ధారించండి అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.

• అనంతరం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే, ఫలితాలు వస్తాయి.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి resultsbie.ap.gov.in


దాదాపు పది లక్షల మంది విద్యార్థులు హాజరూ..

ఈ సంవత్సరం ఇంటర్మీడియ్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతంలో ఫలితాలను వెల్లడించేందుకు ప్రత్యేక కార్యక్రమం, హడావుడి చేయడం వల్ల కొన్నిసార్లు అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఎటువంటి హడావుడి లేకుండా సరిగ్గా చెప్పిన సమయానికి ఫలితాలను విడుదల చేశారు.

ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు: 

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70%, రెండో సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69%గా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం కావడం విశేషం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47%గా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు, విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణమని మంత్రి నారా లోకేశ్ కొనియాడారు.

కృష్ణా జిల్లాదే అగ్రస్థానం..

• ఇంటర్ తొలి ఏడాది ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు అగ్రస్థానం

• రెండో ఏడాది ఫలితాల్లో 93 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు ప్రథమ స్థానం

• తొలి ఏడాది ఫలితాల్లో 54 శాతం ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లాకు చివరి స్థానం

• రెండో ఏడాది ఫలితాల్లో 73 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి జిల్లాకు ఆఖరి స్థానం

ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు నిరాశ చెందవద్దు: 

ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని మంత్రి నారా లోకేశ్ సూచించారు. దీనిని ఒక అడుగుగా భావించి, మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. మీరు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
Comments

-Advertisement-