Inter results: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
Inter results: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు మంగళవారం విడుదల..
మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా విడుదల..
కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు..
మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలు..
9.5 లక్షల మందికి పైగా హాజరు..
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను మంగళవారం (ఏప్రిల్ 22న) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరాల పరీక్ష ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సుమారు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
1) ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
2 ) ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ట్యాబుపై క్లిక్ చేయండి.
3) మీ హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
4) ఫలితాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.
5) వాటిని ప్రింట్ తీసుకోవచ్చు.