రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల

INTERMEDIATE RESULTS 2025 AP INTERMEDIATE RESULTS AP INTERMEDIATE RESULTS ON APRIL 12 INTERMEDIATE RESULTS UPDATE resultsbie.ap.gov.in AP INTER RESULT
Peoples Motivation

Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల

INTERMEDIATE RESULTS 2025 AP INTERMEDIATE RESULTS AP INTERMEDIATE RESULTS ON APRIL 12 INTERMEDIATE RESULTS UPDATE resultsbie.ap.gov.in AP INTER RESULT

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదలపై ఏపీ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 12 శనివారం నాడు ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ (AP)లో శనివారం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ రెండు సంవత్చరాల పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామన్నారు. విద్యార్థుల తమ ఫలితాలను resultsbie.ap.gov.in లో ఆన్లైన్‌లో చూసుకోవచ్చునని తెలిపారు. మన మిత్ర వాట్స్ యాప్ నంబర్‌కు 9552300009 లో ‘hi’ అని పంపి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చునని చెప్పారు. అందరికి మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ మంత్రి నారా లోకేష్ బెస్ట్ విషెస్ చెప్పారు.

కాగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు శనివారం (మార్చి1న) ప్రారంభం మయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్‌ రెండు సంవత్సరాల విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్‌ జోన్‌’గా ప్రకటించారు. మార్చి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి.

ఇప్పటికే ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా కొనసాంది. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తి చేశారు. ఆ తర్వాత ఫలితాలను కంప్యూటరీకరణ చేసేందుకు 5-6 రోజుల సమయం పట్టింది. ఈ సంవత్సరం టెన్త్, ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల చేసినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. అధికారులు. వాట్సాప్‌ నంబర్ 9552300009 లేదా BIEAP అధికారిక వెబ్‌సైట్‌ resultsbie.ap.gov.in ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.

Comments

-Advertisement-