రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Inter results: అప్పుడే ఇంటర్ ఫలితాలు

ap inter results AP First year results 2025 inter results date ap inter results 2025 date ts inter results TS inter results 2025 AP inter results 2025
Peoples Motivation

Inter results: అప్పుడే ఇంటర్ ఫలితాలు

• పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు..

• దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం..

ap inter results AP First year results 2025 inter results date ap inter results 2025 date ts inter results TS inter results 2025 AP inter results 2025

-Advertisement-


ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12-15 మధ్య విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తవుతుంది. ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్ ఉంటుంది. దీనికి ఐదారు రోజులు సమయం పడుతుంది. ఈసారి వాట్సప్ లోనే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కు లను పీడీఎఫ్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే షార్ట్ మెమోలుగా ఉపయోగపడను న్నాయి. గతంలో ఫలితాలు ఇచ్చి, ఆ తర్వాత షార్ట్ మెమోలను ఆన్లైన్లో ఉంచేవారు. ఈసారి వాట్సప్ లో ఫలితాలు ఇస్తున్నందున పీడీఎఫ్ రూపంలో మార్కులు ఇవ్వనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలను ఈసారి వాట్సాప్‌ ద్వార విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఫలితాలు విడుదల చేస్తే ఇంటర్‌నెట్‌ సెంటర్‌కు వెళ్లడమో, సెల్‌ఫోన్‌లోనో చూసుకునే వాళ్లు. ఇకపై ఈ ఇబ్బంది లేకుండా నేరుగా ఫలితాలు విద్యార్థి తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్‌లకే పంపించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు ఈ మధ్య ముగిశాయి. మూల్యాంకనం కూడా వేగంగా సాగుతోంది. మార్చి 17తో పరీక్షలలు పూర్తి అయ్యాయి. మార్చి 19 నుంచి మూల్యాంకనం ప్రారంభమైంది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు. ఇది ఏప్రిల్‌ 10 నాటికి పూర్తి కానుంది. మిగతా ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్‌ మూడో వారంలో ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు అధికారులు. ఇప్పుడు ఈ ఫలితాలను రెండు విధాలుగా చూసుకోవచ్చు. ఫలితాలు విడదలైన తర్వాత సంప్రదాయపద్ధతిలో నెట్‌లో నెంబర్‌ టైప్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. అయితే అంత కంటే ముందే తల్లిదండ్రులు, విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నెంబర్ వాట్సాప్‌కు ఫలితాలు పంపిస్తారు. ఫలితాలు వచ్చిన పది నుంచి 20 నిమిషాల్లోనే ఫలితాలు విద్యార్థి ఇచ్చిన నెంబర్‌కు పంపించనున్నారు. ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు ఈ మార్కులు పంపిస్తారు. రెండో సంవత్సరం చదువుతున్న వాళ్లకు రెండేళ్లకు సంబంధించిన మార్క్స్‌షీట్స్ పంపిస్తారు. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌ తీసుకొని వాడుకోవచ్చు.

Comments