రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Inter Results: మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ

INTERMEDIATE RESULTS 2025 AP INTERMEDIATE RESULTS AP INTERMEDIATE RESULTS ON APRIL 12 INTERMEDIATE RESULTS UPDATE resultsbie.ap.gov.in AP INTER RESULT
Peoples Motivation

Inter Results: మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ

• ఇంటర్ ఫస్టియర్లో 70 శాతం ఉత్తీర్ణత..

• ఇంటర్ సెకండియర్లో 83 శాతం ఉత్తీర్ణత..

• ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి.. 

INTERMEDIATE RESULTS 2025 AP INTERMEDIATE RESULTS AP INTERMEDIATE RESULTS ON APRIL 12 INTERMEDIATE RESULTS UPDATE resultsbie.ap.gov.in AP INTER RESULT

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఇంటర్ మొదటి సంవత్సరం 70 శాతం ఉత్తీర్ణత.. రెండో సంవత్సరం 83 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70 శాతం మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47 శాతంగా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు మరియు విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణంగా పేర్కొన్నారు..

ఇంటర్ రెగ్యులర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4,87,295 మంది విద్యార్థులు, ఇంటర్ రెగ్యులర్ రెండో సంవత్సరం పరీక్షలకు 4,22,030 మంది విద్యార్థులు హాజరు కాగా.. మొత్తం రెగ్యులర్ విద్యార్థుల సంఖ్య 9,09,325గా ఉంది.. ఒకేషనల్ విద్యార్థులు మొదటి సంవత్సరం 38,553 మంది, రెండో సంవత్సరం 33,289 మంది కలిపి మొత్తం 71,842 మంది విద్యార్థులు హాజరయ్యారు.. ఇక, ప్రైవేట్గా పరీక్షలు రాసిన విద్యార్థులు 35,935 మంది.. మొత్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం 5,25,848 మంది, రెండో సంవత్సరం 4,91,254 మంది విద్యార్థులు కలుపుకొని 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు అయ్యారు.. అయితే, రెగ్యులర్ ఇంటర్ 3,51,521 మంది అంటే 83 శాతం మంది.. మొదటి సంవత్సరం 3,42,979 మంది అంటే 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. ఒకేషన్ మొదటి సంవత్సరం 77 శాతం, రెండో సంవత్సరం 62 శాతం ఉత్తీర్ణులయ్యారు.. ఇక, రెగ్యులర్ ఇంటర్ రెండో సంవత్సరం బాలుర ఉత్తీర్ణత శాతం 80 శాతంగా ఉంటే.. బాలికలు 86 శాతంతో పై చేయి సాధించారు.. ఇంటర్ మొదటి సంవత్సరం లో బాలురు 66 శాతం ఉత్తీర్ణులైతే.. బాలికలో 75 శాతంతో ముందు వరుసలో నిలిచారు.. ఒకేషన్ రెండో సంవత్సరం లో బాలురు 67 శాతం, బాలికలు 84 శాతం.. మొదటి సంవత్సరం లో బాలురు 50 శాతం, బాలికలు 71 శాతం పాస్ అయ్యారు.

మొదటి స్థానంలో కృష్ణా, చివరి స్థానంలో చిత్తూరు..

మరోవైపు రెండో సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో 93 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. గుంటూరు 91 శాతంలో రెండో స్థానంలో.. ఎన్టీఆర్ జిల్లా 89 శాతంతో మూడో స్థానంలో.. తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం 87 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 73 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామ రాజు జిల్లా.. అనకాపల్లి చివరి స్థానంలో నిలిచాయి.. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే.. వరుసగా 82 శాతం, 81 శాతం, 79 శాతంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం నిలిచాయి.. ఇక, 54 శాతం ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా అట్టడుగు స్థానానికి పరిమితమైంది.

ఇంటర్మీడియట్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తేదీలు

మరోవైపు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తేదీలను సైతం ప్రకటించారు. ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఫెయిలైన విద్యార్థుల కోసం థియరీ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 28వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జిల్లా కేంద్రాలలో మాత్రమే నిర్వహిస్తామని ప్రకటించారు. సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించాలని సూచించారు.

మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ

మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ జరుగనుంది. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు. ఈ పరీక్షను రాసేందుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి. ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఎలాంటి ఆందోళన పడకుండా.. సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని అధికారులు కోరుతున్నారు.

ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఇక్కడ చూడండి.

ఇంటర్‌ ఫలితాలు విడుదల resultsbie.ap.gov.in లో చూడవచ్చు. లేదంటే ఎంతో సింపుల్గా వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు Hi మెసేజ్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. తద్వారా ఫోన్లోనే రెండే రెండు నిమిషాల్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.

• మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 కు Hi మెసేజ్ చేయాలి.

• తరువాత మనకు సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.

• అందులో మనకు కావలసిన విద్య సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

• అందులో ఇంటర్మీడియట్ ఫలితాలు అనే కాలమ్ ఉంటుంది.

• దానిని సెలక్ట్ చేసుకుని, నిర్ధారించండి అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.

• అనంతరం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే, ఫలితాలు వస్తాయి.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి resultsbie.ap.gov.in

Comments

-Advertisement-