HPCL Job Notification: జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..నోటిఫికేషన్ విడుదల
HPCL Job Notification: జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..నోటిఫికేషన్ విడుదల
• హెచ్పీసీఎల్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల..
• 63 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన..
• జీతం ఎంతో తెలుసా?
ముంబయిలోని హిందూస్థాన్ పెట్రోలియం(HPCL) 63 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం 63 ఖాళీల్లో..
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (జేఈ) మెకానికల్ - 11,
జేఈ (ఎలక్ట్రికల్) -17,
జేఈ (ఇన్‌స్ట్రుమెంటేషన్) - 6,
జేఈ (కెమికల్)-1,
జేఈ (ఫైర్ అండ్ సేఫ్టీ)-28 ఉన్నాయి.
అర్హతలు:
మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్/ కెమికల్/ కెమికల్ టెక్నాలజీ/ ఫైర్ అండ్ సేఫ్టీ విభాగాల్లో వడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 50 శాతం సరిపోతుంది.
వయసు:
25 సంవత్సరాలు మించరాదు. ఎస్సీ\ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు పదేళ్లు, దివ్యాంగులకు పదిహేనేళ్లు, మాజీ సైనికోద్యోగులకు ఐదేళ్లు సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు ఫీజు:
ఫీజు రూ.1,180, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
వేతనం:
రూ.30,000-రూ.1,20,000. అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, వైద్య, ఆరోగ్య బీమా సదుపాయాలు.
ఎంపిక విధానం (Selection process)
• కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)
• గ్రూప్ టాస్క్/ గ్రూప్ డిస్కషన్
• స్కిల్ టెస్ట్
• ఇంటర్వ్యూ
• వైద్య పరీక్షలు
• ఫిజికల్ ఫిట్‌నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక
పరీక్ష : సీబీటీ ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పార్టులుగా ఉంటుంది. పార్ట్-1 జనరల్ ఆప్టిట్యూడ్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ (లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్) ఉంటాయి. పార్ట్-2 టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్‌లో సబ్జెక్టు సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి దశలోనూ కనీసార్హత మార్కులు సాధించినవారిని కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు.
సీబీటీ సిలబస్ వివరాలను త్వరలోనే వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
ఎంపికైనవారు ఏడాదిపాటు ప్రొబేషన్‌లో పనిచేయాల్సివుంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2025
వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/careers
వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/careers