EdCET 2025: బీఈడీ ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి సమాచారం
EdCET 2025: బీఈడీ ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి సమాచారం
తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ (రెండేళ్ల కోర్సు) ప్రవేశాల కోసం తెలంగాణ ఎడ్ సెట్ (TG EdCET 2025( నోటిఫికేషన్ విడుదలైంది. కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే ఈ ఎంట్రన్స్ టెస్ట్ వివరాలను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు..
విద్యార్హత:
అభ్యర్థులు కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రిజర్న్స్ కేటగిరీ అభ్యర్థులకు (SC/ST/BC/PWD) 40% మార్కులు ఉండాలి.
మే 24 వరకు అవకాశం..
దరఖాస్తుల సమయానికొస్తే.. ఈ నెల 12 నుంచి మే 13వ తేదీ వరకు అభ్యర్థులు ఎలాంటి ఫైన్ లేకుండా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, మిగతా వాళ్లు రూ.750 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తరువాత, దరఖాస్తులు చేసుకునేందుకు రూ.250 లేట్ ఫీజుతో మే 20వ తేదీ వరకు, రూ.500 లేట్ ఫీజుతో మే 24వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
పరీక్ష ఎప్పుడంటే..
ఇక, టీజీ ఎడ్సెట్ 2025 పరీక్ష.. జూన్ 1వ తేదీన రెండు సెషన్లలో ఉంటుంది. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్ కాగా, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
ముఖ్యమైన వివరాలు
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: మార్చి 12, 2025
దరఖాస్తుకు చివరి తేది (లేట్ ఫీజు లేకుండా): మే 13, 2025
లేట్ ఫీజుతో అప్లికేషన్ సమర్పణ:
రూ. 250 అపరాధ రుసుముతో మే 20, 2025
రూ. 500 అపరాధ రుసుముతో మే 24, 2025
పరీక్ష తేదీ & విధానం: పరీక్ష తేదీ: జూన్ 1, 2025
రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT):
ఉదయం: 10:00 AM 12:00 PM
మధ్యాహ్నం: 2:00 PM - 4:00 PM
ఫీజు వివరాలు:
సాధారణ అభ్యర్థులకు: ₹750
SC/ST/PWD అభ్యర్థులకు: ₹550
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్: https://edcet.tsche.ac.in