రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్

TS TET 2025 AP TET NOTIFICATION AP DSC notification ap dsc shedule ap dsc exam dates AP Teacher Jobs ap dsc hall tickets AP DSC online application
Peoples Motivation

ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్

పేదల కోసం సంపద సృష్టిస్తాం

పేదరికం నిర్మూలనకే పీ4

బటన్లు నొక్కామంటున్నారు.. వారు నొక్కిన బటన్లు మనమిచ్చే పెన్షన్లతో సమానం

అనవసర విమర్శలు చేసే వారిని ప్రజలు నిలదీయాలి

ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ - స్కూళ్లు తెరిచే నాటికి నియామకాలు పూర్తి

— ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పర్చూరు నియోజకవర్గం, కొత్తగొల్లపాలెంలో పేదల సేవలో పొల్గొన్న సీఎం

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేత

TS TET 2025 AP TET NOTIFICATION AP DSC notification ap dsc shedule ap dsc exam dates AP Teacher Jobs ap dsc hall tickets AP DSC online application

బాపట్ల జిల్లా, ఏప్రిల్ 1 : సంపద సృష్టించగా వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు ఖర్చు చేస్తామని, పేదరికం నిర్మూలనకే పీ4 విధానానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలే ముందు ఆ తర్వాతే మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మంగళవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. 

వారు నొక్కిన బటన్లు మనమిచ్చే పెన్షన్లతో సమానం..

బటన్లు నొక్కామని కొందరు గొప్పగా చెప్పుకుంటున్నారని వారు నొక్కిన బటన్లు మనమిచ్చే పెన్షన్లతో సమానమని అన్నారు. అనవసర విమర్శలు చేసేవారిని ప్రజలు నిలదీయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక. రాష్ట్రంలో టీడీపీ ఇంత బలంగా ఉందంటే అందుకు వెనుకబడిన వర్గాలే కారణం. 43 ఏళ్లుగా టీడీపీ జెండా మోసింది బలహీన వర్గాలే . బెదిరించినా భయపడకుండా ఎదురొడ్డి పోరాడారు. జెండా మోశారు. పార్టీని ఆదుకున్న వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. 

అసమర్థ ప్రభుత్వంలో అప్పులే మిగిలాయి..

గత ప్రభుత్వ అసమర్థ పాలన ఎలా ఉందో అందరం చూశాం. రాష్ట్రాన్ని సర్వనాశం చేసిపోయారు. రూ. 10 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చింది. ఓవైపు సంక్షేమం, అభివృద్ధి చేస్తూనే మరోవైపు అసలు, వడ్డీ రెండూ కట్టాలి. సంపద సృష్టించి ఆదాయం పెంచి దాన్ని నిరంతరం పేదలకే ఖర్చు పెడతానని హామీ ఇస్తున్నాను. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు మిత్రులు పవన్ కల్యాణ్ , నేనూ , బీజేపీ జతకట్టాం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. 

పేదల కళ్లలో ఆనందం చూస్తున్నా..

నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో ప్రతి నెలా స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నాను. 28 రకాల పింఛన్లు ఇస్తున్నాము. మన దేశంలో ఒక్క పెన్షన్ల కిందే ప్రతి నెలా 63 లక్షల మందికి ఏడాదికి రూ. 33,100 కోట్లు వ్యయం చేస్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే రాష్ట్రం దేశంలో ఒక్క ఏపీనే. రూ. 200 పింఛను రూ. 2 వేలు చేసింది నేనే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 3,000 పింఛను రూ 4000 వేలు చేశాను. డయాలసిస్ రోగులకు రూ. 10 వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు పింఛను ఇస్తూ మానవత్వాన్ని నిరూపించుకున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్టే పింఛన్లూ అందిస్తున్నాను. ప్రతి నెలా ఒకటిన ఉదయం 9 గంటలకే 80 శాతం, తొలిరోజే 98 శాతం మందికి పింఛన్లు పంపిణీ పూర్తి చేస్తున్న అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నాను.

పేదలకు ఆర్థిక భరోసా..

కొందరి ఆదాయం కంటే పింఛను ద్వారానే ఎక్కువ వస్తోంది. ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లిన వారు పింఛను అందుకోలేకపోయేవారు. అలాంటి వారికి గత ప్రభుత్వంలో పింఛను ఇవ్వలేదు. కానీ మన ఎన్డీఏ ప్రభుత్వంలో మూడో నెలలోనైనా పింఛను తీసుకునే అవకాశం కల్పించాము. అలా రెండు నెలలు వరుసగా పింఛను తీసుకోని వారు మన రాష్ట్రంలో 93,324 మంది ఉన్నారు. వీరికి పింఛను ఆపేస్తే ప్రభుత్వానికి రూ. 74 కోట్లు మిగుల్తుంది. కానీ పేదలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ఆ సొమ్ము చెల్లిస్తున్నాము. అలాగే మూడు నెలలకూ పింఛను తీసుకోనివారు 16 వేలమంది ఉన్నారు. వారికీ రూ. 14 కోట్లు చెల్లిస్తున్నాం. భర్త చనిపోయిన భార్యకు వెంటనే పింఛను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. పింఛన్లు పంపిణీని టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నాం. పింఛను ఇంటికి తెస్తున్నారా లేదా, మర్యాదగా ఇస్తున్నారా లేదా అనే దానిపై నేను నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాను. తెలంగాణ- రూ.2,016, తమిళనాడు-రూ. 1000, కేరళ-రూ.1600 , కర్ణాటక-రూ.600, యూపీ, ఒడిశాలో రూ. 500 చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. సంక్షేమం ఇవ్వలేదనే వారికి ఇదే సమాధానం. 

ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్

రాజధాని అమరావతి పనులకు శ్రీకారం చుట్టాం. నాలుగేళ్లలో అమరావతికి పూర్వ వైభవం తెస్తాం. ఏపీ జీవనాడి పోలవరం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. రాష్ట్రవ్యాప్తంగా 200కి పైగా అన్నక్యాంటీన్లు పెట్టి పేదలకు భోజనం పెడుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు మంజూరు చేసింది. విశాఖకు రైల్వే జోన్ వస్తోంది. గత ఐదేళ్లు రోడ్లు ఎలా ఉన్నాయో చూశారు. ఆ గుంతల రోడ్లలో ఆస్పత్రికి వెళ్తూ దారి మధ్యలోనే గర్భిణీ డెలివరీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రోడ్ల మరమ్మతులు చేపట్టాం. భవిష్యత్ లో రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోతాయి. ఈ నెలలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చి జూన్ లోగా కొత్త టీచరు పోస్టులు భర్తీ చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ మే నెలలో తల్లికి వందనం ఇస్తాం. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలండర్లు ఏడాదికి 3 ఇస్తున్నాం. కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలిపి రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ. 20 వేలు వేస్తాం. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఈనెలలోనే మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తాం. నేను తెచ్చిన డ్వాక్రా సంఘాలు నేడు ఒక వ్యవస్థగా మారినందుకు ఎంతో గర్వంగా ఉంది. 

అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు..

47 సంవత్సరాలుగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. సమైక్యాంధ్రలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా, నవ్యాంధ్రలోఆరో సంవత్సరం ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. ఇది నాకు ప్రజలిచ్చిన అరుదైన గౌరవం. ఏ నాయకుడికి ఈ అవకాశం దొరకలేదు. 

పేదరికం లేని సమాజమే నా ఆశయం. సంపద కొందరికే పరిమితం కాకూడదు. ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందినప్పుడు సమసమాజ స్థాపన సాధ్యమవుతుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగానే పీ4 కార్య‌క్ర‌మం రూపొందించాం. స‌మాజంలో ఉన్న‌తంగా ఉన్న 10 శాతం సంప‌న్న వ‌ర్గాలు స‌మాజంలో అట్ట‌డుగున ఉన్న 20 శాతం మంది పేద కుటుంబాల‌ను ఆదుకుని వారి అభ్యున్న‌తి కొర‌కు స్వ‌చ్ఛందంగా ముందుకురావాలి. పేద కుటుంబాల‌ను ఆదుకునే వారు మార్గ‌ద‌ర్శిగా, ఆదుకోబ‌డిన వారు బంగారు కుటుంబంగా పరిగణించబడతారు. ఎన్టీఆర్, అంబేద్కర్, అబ్దుల్ కలాం సహా ఎవరూ పుట్టుకతోనే గొప్పవారిగా పుట్టలేదు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని మహోన్నత వ్యక్తులుగా ఎదిగారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఇల్లు, పింఛను, మంచి నీటి కుళాయి, కరెంటు, మరుగుదొడ్లు, డ్రైనేజ్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కల్పిస్తాం. 

మార్గదర్శులకు సీఎం అభినందన..

పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చిన విక్రమ్ నారాయణరావు, వసంత శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు అభినందించారు. దాతలిద్దరూ చెరో 15 కుటుంబాలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకోనున్నారు. 

పర్చూరు నియోజకవర్గానికి సీఎం వరాలు..

పర్చూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును మనస్పూర్తిగా అభినందిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు షిప్ బిల్డింగ్, షిప్ రిపేరింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని సీఎం చెప్పారు. అలాగే నాగార్జున సాగర్ కాలువ ఆధునీకరణ పనులు, నూతన ఎన్సీపీ కార్యాలయం, షాదీఖానాలు, దర్గాల ఆధునీకరణ పనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణం, బీసీ, ఓసీలకు శ్మశాన వాటికల నిర్మాణం, రూ. 9 కోట్ల 10 లక్షల వ్యయంతో జాతీయ రహదారి నుంచి వలపర్ల ఇండస్ట్రియల్ పార్క్ కు డబుల్ రోడ్డు, వలపర్ల గ్రామంలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్, ఇంకొల్లు-మార్టూరు-పర్చూరులో ఆటోనగర్ ఏర్పాటుకు అనుమతులు, కొమ్మూరు కాలువ భూ సేకరణకు రూ. 5 కోట్లు మంజూరు, పర్చూరు-కారంచేడు-ఇంకొల్లు-చినగంజాంలో మూడు వ్యవసాయ మార్కెట్లు, ఇంకొల్లులో డ్రైనేజ్ సమస్య పరిష్కారం సహా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పేదలకు వైద్యానికి ఆర్థిక సాయం వంటి అన్ని పనులకు ప్రభుత్వం నుంచి వెంటనే నిధులు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 

పోలీస్ అయ్యి ప్రజల్ని రక్షించాలి..

కొత్తగొల్లపాలెంలో మానసిక దివ్యాంగురాలైన వడ్లమూడి సుభాషిణి ఇంటికి పింఛను అందించేందుకు సీఎం వెళ్లారు. సుభాషిణి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఆమె తల్లికి ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుభాషిణి చెల్లెలు భరణిని ఏం చదువుకుంటున్నావ్, ఏం కావాలనుకుంటున్నావని సీఎం అడిగారు. భరణి సమాధానం ఇస్తూ.. తనకు పోలీస్ అవ్వాలని ఉందని చెప్పింది. జనాల్ని బాగా కొట్టొచ్చు అని పోలీస్ అవుదామనుకుంటున్నావా అని నవ్వుతూ అన్నారు. పోలీస్ అయ్యి ప్రజల్ని కాపాడాలని సీఎం సూచించారు. చదివించుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని కుటుంబ సభ్యులు తెలపగా ఆమెను కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఇష్టపడి చదువుకోవాలి..

మరో లబ్ధిదారు బత్తుల జాలమ్మ గృహానికి వితంతు పెన్షన్ పంపిణీ చేశారు. జాలమ్మ ఇల్లు శిథిలావస్థకు చేరడంతో చూసి చలించిపోయిన సీఎం వెంటనే గృహాన్ని మంజూరు చేయడంతో పాటు గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏం చదవు కుంటున్నావని జాలమ్మ చిన్నకుమారుడుని ప్రశ్నించగా పదవ తరగతి మధ్యలో నిలిపేశానని చెప్పారు. చదువుకుంటావా అని సీఎం అడగ్గా...చదువు రాదు అని అతను తిరిగి సమాధానం ఇచ్చాడు. ఎందుకు రాదు, మేమంతా వచ్చి చదువుకున్నామా, ఇష్టపడి చదవుకున్నాం అని అన్నారు. చదవు రాదని మనసులో పడితే రాదని, వస్తుందంటే వస్తుందని అన్నారు. ఎప్పుడూ గొర్రెలు మేపడమే కాదు, పై స్థాయికి రావాలని సీఎం చంద్రబాబు సూచించారు

Comments

-Advertisement-