నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్ సమస్యల పరిష్కారానికి చర్యలు
నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్ సమస్యల పరిష్కారానికి చర్యలు
అనంతపురం, ఏప్రిల్ 04 (పీపుల్స్ మోటివేషన్):-
అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అనంతపురం డివిజన్ కు సంబంధించి జిల్లాస్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ, డిఎల్సి/ డిఎల్ఎన్సి సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్ ని తొలగించేందుకు, "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో వస్తున్న అర్జీలకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతివారం షెడ్యూల్ చేసుకుని జిల్లాస్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో 22ఏకు సంబంధించి బుక్కరాయసముద్రం, కళ్యాణదుర్గం మండలాలకి సంబంధించిన 6 కేసులకు సంబంధించి విచారించగా, అందులో 5 కేసులను ఆమోదించడం జరగగా, 1 కేసును తిరస్కరించడం జరిగింది. డాటెడ్ ల్యాండ్స్ కి సంబంధించి బుక్కరాయసముద్రం మండలానికి సంబంధించిన 2 కేసులకు సంబంధించి విచారించగా, 2 కేసులను ఆమోదించడం జరిగింది. అలాగే రాయదుర్గం మున్సిపాలిటీకి సంబంధించి డిఎల్ఎన్సి (డిస్ట్రిక్ లెవెల్ నెగోషియేషన్) నిర్వహించి ఒక ఎకరా 43 లక్షలకు నిర్ణయించడం జరిగింది.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మాలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, ఆర్డీఓలు కేశవ నాయుడు, వసంతబాబు, కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ రియాజుద్దీన్, ఆయా మండలాల తహసీల్దార్ లు పుణ్యవతి, మహబూబ్ భాష, భాస్కర్, నాగరాజు, కలెక్టరేట్ ఈ సెక్షన్ డిటి ప్రభంజన్ రెడ్డి, రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.