రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సంచార జాతుల అభివృద్దే సీఎం చంద్రబాబు ధ్యేయం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

సంచార జాతుల అభివృద్దే సీఎం చంద్రబాబు ధ్యేయం

—రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

Minister Savita

అమరావతి : రాష్ట్రంలో ఎంబీసీ కులాల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో ఉన్నారని, ఇళ్ల స్థలాలతో పాటు ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు అందజేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎంబీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చనున్నట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎంబీసీ కుల సంఘాల నాయకులతో మంత్రి సవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆ కులాల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, కూటమి విజయంలో ఎంబీసీ కులాలు ముఖ్యపాత్ర పోషించాయన్నారు. సంచార జాతులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమన్నారు. సమావేశంలో తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి అంశాన్నీ సీఎం చంద్రబాబుకు వివరిస్తానన్నారు. ఎంబీసీ సమస్యలపై సీఎం చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో సంచార జాతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టంచేశారు. సంచార జాతులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తామన్నారు. కళాకారులకు పెన్షన్ల మంజూరు విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సంచార జాతుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. ఆదరణ పథకంలో భాగంగా సంచార జాతులకు అవసరమైన పరికరాలు సమకూర్చుతామన్నారు. 

బెగ్గింగ్ నిర్మూలనే చంద్రబాబు ధ్యేయం

రాష్ట్రంలో బెగ్గింగ్ అనే మాటే వినబడకూడదని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి సవిత తెలిపారు. అందుకోసమే ఎంబీసీకి చెందిన సంచార జాతులతో స్వయం ఉపాధి పథకాల్లో భాగంగా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. 2014-19 మధ్య బ్యాంకులతో సంబంధం లేకుండా 90 శాతం సబ్సిడీతో సంచార జాతులకు సీఎం చంద్రబాబునాయుడు రూ.30 వేల మేర ఆర్థిక చేయూత అందించారన్నారు. అదే మాదిరిగా ఎంబీసీలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా అందజేయనుందన్నారు. గతంలో కంటే అదనంగా ఆర్థిక సాయమందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

సంచార జాతుల్లో విద్యకు ప్రాధాన్యం

నిరక్షరాస్యత కారణంగానే సంచార జాతులు అభివృద్ధిని నోచుకోలేకపోతున్నాయని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. సంచార జాతుల వారు తమ పిల్లలను విద్యకు దూరం చేయొద్దని సూచించారు. విద్యతోనే ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపు లభిస్తుందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లలను బడులకు పంపాలని, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. రెసిడెన్షియల్ స్కూళ్లో సంచార జాతుల పిల్లలకు నేరుగా అడ్మిషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయమై మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మాదిరిగా విద్యా సంస్థల్లో రాయితీపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానన్నారు. అర్హులైన సంచార జాతుల విద్యార్థులకు విదేశీ విద్యా పథకం కింద అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సందర్బంగా ఎంబీసీ నాయకులు మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తమకు న్యాయం జరిగిందని, మరోసారి సీఎం చంద్బరాబునాయుడు అధికారంలోకి రావడంతో, తమ బతుకులకు భరోసా లభించిందని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం మంత్రి సవితను ఎంబీసీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-