రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

• యువ పారిశ్రామిక వేత్తలకు ఊతమిచ్చేలా ఇండస్ట్రీయల్ పాలసీ 

• ఇప్పటికే రూ. 8.5 లక్షల కోట్లు మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చాము. 

• పరిశ్రమల స్థాపనలో దేశంలోనే మన రాష్ట్రాన్ని టాప్ లో నిలుపుతాము

• రాష్ట్రంలో 175 ఇండస్ట్రీయల్ పార్క్ లు ఏర్పాటుకు సన్నాహాలు

• 2 నెలల్లోపే ప్రతి జిల్లాలో ఒక ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తాం

• 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ధ్యేయం

TG BHARATH

రాష్ట్ర మంత్రులు టి.జి. భరత్, కొండపల్లి శ్రీనివాస్

విజయవాడ, ఏప్రిల్ 04 (పీపుల్స్ మోటివేషన్):-

ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్ధేశంలో రాష్ట్రంలో యువ, నూతన పారిశ్రామిక వేత్తలకు ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పాలసీని తీసుకువచ్చామని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మన రాష్ట్రానికి రూ. 8.5 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు టి.జి. భరత్, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్ మెంట్, రిలేషన్స్ శాఖామాత్యులు కొండపల్లి శ్రీనివాస్ లు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి ప్రగతిశీల విధానాల కోసం కార్యాచరణ మార్గదర్శకాలను మంత్రులు టి.జి. భరత్, కొండపల్లి శ్రీనివాస్ లు విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో శుక్రవారం విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఆహార శుద్ది శాఖామాత్యులు శ్రీ. టి.జి. భరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం నుంచి పారిశ్రామిక వేత్తలు పారిపోయారన్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని, వారికి అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పాలసీ తీసుకువచ్చింది కాని గైడ్ లైన్స్ రూపొందించలేదన్నారు. గత ప్రభుత్వ హాయాంలో బకాయి ఉన్న సబ్సిడీలను కూడా అతి త్వరలోనే విడుదల చేయనున్నామని మంత్రి హామి ఇచ్చారు. దేశంలోనే బెస్ట్ ఇన్సెంటీవ్ లను అందించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నూతన పారిశ్రామిక విధానం తీసుకురావడంతో పాటు గత ప్రభుత్వం విడుదల చేసిన పాలసీకి సైతం గైడ్ లైన్స్ రూపొందించడం జరిగిందని మంత్రి టి.జి. భరత్ తెలిపారు.

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖామాత్యులు కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మరో రెండు నెలల్లో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, అలాగే మరో రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 175 ఇండస్ట్రీయల్ పార్క్ ల ఏర్పాటు చేస్తామని తెలిపారు. కనీసం మండలానికో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పనలో భాగంగా ఇప్పటి నుంచే పారిశ్రామిక అనుకూల విధానాలు అవలంభిస్తున్నామన్నారు.‌ దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచేలా ఇండస్ట్రీయల్ పాలసీ రూపొందించి అమలు చేయనున్నామని తెలిపారు. ఉపాధి, ఉద్యోగ కల్పనే ధ్యేయంగా సీఎం ఆధ్వర్యంలో ముందుకు వెళుతున్నామని వివరించారు. పి-3, పి-4 విధానంలో ఇండస్ట్రీయల్ పార్క్ లను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. పారిశ్రామికంగా ప్రైవేటు పార్కులు ఏర్పాటు చేయాలన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ప్రభుత్వం అవసరమైన ప్రోత్సహాకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

పరిశ్రమలు మరియు వాణిజ్య, ఆహారశుద్ది శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో భాగంగా ఇండస్ట్రీయల్ ఏర్పాటులో ఫీల్డ్ విజిట్ ను తొలగించాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. ఎర్లీబర్డ్ పోర్టల్ ద్వారా నూతన పారిశ్రామికవేత్తలు తమ యూనిట్ల వివరాలను అప్ లోడ్ చేయాలని సూచించారు. ఉద్యోగ కల్పనకు అధిక అవకావం ఉన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. 

అనంతరం ఏపీ ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎంఈ, ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 గైడ్ లైన్స్ ను మంత్రులు టి.జి. భరత్, కొండపల్లి శ్రీనివాస్ లు విడుదల చేశారు. అలాగే వెబ్ పోర్టల్ ను మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్ఎంఈడీసీ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ రావు, ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జా బాబూరావు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అధికారి గడ్డం శేఖర్ బాబు, ఏపీఎంఎస్ఎంఈడిసీ సీఈవో ఎం. విశ్వ, పారిశ్రామికవేత్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

-Advertisement-