చిరుత మృతి కేసు నుంచి విముక్తి కల్పించండి
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
By
Mounikadesk
చిరుత మృతి కేసు నుంచి విముక్తి కల్పించండి
• శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ గారిని కలిసిన పొన్నూటిపాలెం రైతుల కుటుంబాలు
చిరుత మృతి ఘటనలో తమ వారిపై అన్యాయంగా కేసులు పెట్టారని, కేసుల నుంచి తమ వారికి విముక్తి కల్పించాలని కోరుతూ మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపాలెంకు చెందిన రైతుల కుటుంబ సభ్యులు శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారిని కలిశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తమ బాధని తెలియచేయాలని కోరారు. కేవలం చిరుత చనిపోయిన ప్రాంతానికి ఆనుకుని ఉన్న భూమిని ప్రామాణికంగా చేసుకుని అటవీశాఖ అధికారులు తమ వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. చిరుత మృతిలో తమవారి ప్రేమయం లేకున్నా విచారణ జరపకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అప్పటికప్పుడు అరెస్టులు చూపారని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమ వారికి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా రైతులు కుటుంబాలకు శ్రీ హరిప్రసాద్ గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె నియోజక వర్గం జనసేన ఇంఛార్జి శ్రీ జి. రాందాస్ చౌదరి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ మైఫోర్స్ మహేష్ పాల్గొన్నారు.
Comments