రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

AI వల్ల జీవనోపాధి ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

AI వల్ల జీవనోపాధి ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు: బిల్ గేట్స్, ఒబామా

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సమీప భవిష్యత్ లో లక్షలాది ఉద్యోగాలు గల్లంతే అంటున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. వేర్వేరు వేదికలపై వీరిద్దరూ ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆటోమేషన్‌కు అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌. 

అయితే, కేవలం తయారీ రంగాన్ని మాత్రమే ఆటోమేటిక్‌ చేయట్లేదు. ఉన్నత స్థాయి మేధోపరంగానూ అనేక పనులు చేస్తోంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు చేసే 70శాతం పనులను ఏఐ చేయగలదు. నిపుణులైన ఉద్యోగులు, మంచి జీతభత్యాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఏఐ రాక కాస్త గందరగోళానికి గురిచేస్తుంది. కృత్రిమ మేధ వినియోగం పెరిగితే చాలా ఉద్యోగాలు గల్లంతే. 

వందేళ్లలో ఎన్నడూ చూడనంత అభివృద్ధిని జనం చూస్తారు. దీనివల్ల బ్లూ కాలర్‌ ఉద్యోగులే కాదు, చాలా మంది వైట్ కాలర్ ఉద్యోగులూ ఆందోళనలో పడుతారు. ఉద్యోగం ఎలా? కుటుంబాన్ని పోషించేందుకు ఆదాయం ఎలా? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి’’ అని ఒబామా అభిప్రాయపడ్డారు.

బిల్ గేట్స్ ఏమంటున్నారంటే, "ఇది ఏఐ యుగం.. మనకిప్పటివరకూ ఉన్న జ్ఞానంపై సమాజం దృక్కోణాన్ని సమూలంగా మార్చే శకం. ఇప్పటివరకు గొప్ప గొప్ప డాక్టర్లు, టీచర్ల మేధ అద్భుతం అని కొనియాడాం. కానీ, ఏఐ రాకతో రాబోయే దశాబ్ద కాలంలో వీరికి ఉండే జ్ఞానం ఉచితంగా, అందరికీ అందుబాటులో ఉంటుంది. 

ప్రస్తుతం మన జనాభాకు సరిపడా వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత ఉంది. దీంతో ఏఐతో లభించే మెడికల్‌ సలహాలు, టీచింగ్‌ క్లాస్‌లు అందరికీ నచ్చుతాయి. అయితే, దీని పర్యావసానాలను కొట్టిపారేయలేం. ఇదంతా పక్కనబెడితే.. మరి ఉద్యోగాల సంగతేంటీ? కనీసం వారానికి రెండు, మూడు రోజులైనా పని చేయగలమా? అనేది తెలియదు" అని బిల్‌గేట్స్‌ అంటున్నారు.

Comments

-Advertisement-