Agniveer: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు
Agniveer: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు
భారత తీర ప్రాంతం వెంబడి నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీల నియమకానికి నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన వారికి ‘ఐఎన్‌ఎస్ చిల్కా’లో శిక్షణ ఉంటుంది. 2025, 2026 బ్యాచ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి సమాచారం..
ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు
భారత నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీల నియమకానికి నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన వారికి ‘ఐఎన్‌ఎస్ చిల్కా’లో శిక్షణ ఉంటుంది. 2025, 2026 బ్యాచ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ సమాచారం.
అగ్నివీర్(మెట్రిక్ రిక్రూట్-ఎంఆర్) ఖాళీలు
అర్హతలు: పదో తరగతి పాసైన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్/ ప్లస్2లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టు లుగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. లేదా మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఆటోమొబైల్స్/ కంప్యూ టర్ సైన్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కు లతో మూడేళ్ల డిప్లొమా లేదా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జె క్టుల్లో 50 శాతం మార్కులతో రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసుకున్నవారు అర్హులు. ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 02/2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు 2004 సెప్టెంబరు 1 నుంచి 2008 ఫిబ్రవరి 29 మధ్యలో జన్మించి ఉండాలి. 01/2026 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు 2005 ఫిబ్రవరి 1 నుంచి 2008 జూలై 31 లోపు జన్మించి ఉండాలి. 02/2026 బ్యాంక్ కోసం దరఖాస్తు చేసుకునే వారు 2005 సెప్టెంబరు 1 నుంచి 2008 డిసెంబర్ 31లోపు జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: నేవీ ఎంట్రెన్స్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష, వైద్య పరీక్ష ఉంటాయి.
వేతనం: మొదటి సంవత్సరం ప్రతి నెలా రూ.30,000 రెండో ఏడాది రూ.33,000 మూడో సంవత్సరం రూ.36,500 నాలుగో ఏట రూ.40,000 వేతనం అందుకుంటారు. ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్ ఫండ్కి జమ చేస్తారు. మొత్తం నాలుగేళ్ల వ్యవధికి గానూ సేవా నిధికి రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి వెళ్తుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ జమ చేస్తుంది. ఈ మొత్తం రూ.10.04 లక్షలకు వడ్డీని కలిపి అగ్నివీరునికి అందిస్తారు. సుమారు రూ.11.71 లక్షలు నాలుగేళ్ల తర్వాత వీరు పొందగలరు. దీనిపై పన్ను ఉండదు. ఒక వేళ అగ్నివీరులు నాలుగేళ్లలోపే వైదొలిగితే వారి వేతనం నుంచి జమ అయిన మొత్తాన్నే చేతికి అందిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రోత్సాహం దక్కదు. అలాగే వీరికి పింఛను, గ్రాట్యుటీ, కరవు భత్యం, మిలటరీ సర్వీస్ పే (ఎంఎస్పీ), ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వర్తించవు. ఎక్స్ సర్వీస్మెన్గా పరిగణించరు.
శాశ్వత ఉద్యోగంలోకి..
నాలుగేళ్ల వ్యవధి పూర్తిచేసుకున్న అగ్నివీరుల ఒక్కో బ్యాచ్ నుంచి గరిష్ఠంగా 25 శాతం మందిని నేవీలో సెయిలర్ హోదాతో శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇందుకోసం ఆ వ్యవధిలో ప్రతిభ, పనితీరును ప్రామాణికంగా తీసుకుంటారు. ఇలా అవ కాశం పొందినవారు లెవెల్-3 వేతనంతో కెరియర్ ప్రారంభిస్తారు. అన్ని ప్రోత్సాహాలూ వర్తిస్తాయి. పదవీ విరమణ వయసు వరకు కొనసాగవచ్చు. అనంతరం పించనూ అందుతుంది.
పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 50 మల్టిపుల్ ఆన్సర్ ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్, సైన్స్, మేథ్స్, జనరల్ అవేర్‌నెస్ నాలుగు విభాగాలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి.
స్టేజ్-I (ఐనెట్) ఇలా..
ఆన్లైన్లో వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. మొత్తం నాలుగు సెక్షన్ల నుంచి వీటిని అడుగుతారు. అవి... ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేరెనెస్. ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటాయి. సిల బస్, నమూనా ప్రశ్నపత్రాలు నేవీ వెబ్సైట్లో అందు బాటులో ఉంచారు. ప్రతి సెక్షన్లోనూ నిర్ణీత మార్కులు పొందడం తప్పనిసరి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.
ఫిజికల్ టెస్టులు..
స్టేజ్-1లో అర్హులకు వీటిని నిర్వహిస్తారు. మహిళలు, పురుషులు కనీసం 157 సెం.మీ. ఎత్తు తప్పనిసరి. 1. 6 కి. మీ. దూరాన్ని పురుషులు ఆరున్నర, మహిళలు 8 నిమిషాల్లో పూర్తిచేయాలి. గుంజీలు పురుషులు 20, మహిళలు 15 తీయగలగాలి. వీటితోపాటు పుష్ అప్స్ పురుషులు 15, మహిళలు 10, బెంట్ నీ సిట్ అప్స్ పురుషులు 15, మహిళలు 10 తీస్తే అర్హత సాధిస్తారు.
స్టేజ్-2 ఇలా..
ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులో అర్హులకు దీన్ని నిర్వహి స్తారు. ఇది కూడా స్టేజ్-1 మాదిరిగానే వంద మార్కు లకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు పరీక్ష వ్యవధి ఒక గంట. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ విభాగాల్లో వీటిని అడుగుతారు. ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటాయి. నమూనా ప్రశ్న పత్రాలు నేవీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ప్రతి సెక్షన్లోనూ నిర్ణీత మార్కులు పొందడం తప్పని సరి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.
తుది ఎంపిక:
స్టేజ్-2లో అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో విజయవంతమైనవారిని స్టేజ్-2 పరీక్షలో పొందిన మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్ఎస్, చిలక సరస్సులో శిక్షణ ఇస్తారు. అనం తరం విధుల్లోకి తీసుకుంటారు.
ముఖ్యమైన సమాచారం:
ఆన్లైన్ దరఖాస్తు గడువు: ఏప్రిల్ 10 సాయంత్రం 5 గంటల వరకు.
పరీక్ష ఫీజు: జీఎస్టతో కలిపి రూ.649.
స్టేజ్-1 ఐనెట్: మే నెలలో.