రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Agniveer Recruitment: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

joinindiannavy.gov.in Agniveer Apply Online Form Join Indian Navy Agniveer Agniveer Navy eligibility Join Indian Army indian Navy jobs Navy recruitmen
Peoples Motivation

Agniveer Recruitment: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

• అగ్నివీర్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులు..

• ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు..

• మహిళలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు..

joinindiannavy.gov.in Agniveer Apply Online Form Join Indian Navy Agniveer Agniveer Navy eligibility Join Indian Army indian Navy jobs Navy recruitmen

దేశవ్యాప్తంగా భద్రతా దళాల్లో చేరేందుకు యువతకు ఓ మంచి అవకాశం. ఎంతో మంది యువత ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్స్ ఉద్యోగాల్లో చేరాలని కలలు కంటుంటారు. ఇండియన్ నేవీ అగ్నివీర్ సీనియర్ సెకెండరీ రిక్రూట్(SSR) ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో పోటీ పడవచ్చు. మహిళలూ సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిఏటా రెండుసార్లు ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ పోస్టులకు ప్రకటనలు విడుదల చేస్తారు. ఇవి శాశ్వత ఉద్యోగాలు కానప్పటికీ అగ్నివీర్గా ఎంపికైతే ప్రతి నలుగురులో ఒకరికి మాత్రం శాశ్వత ఉద్యోగ అవకాశం దక్కుతుంది. ఆ తర్వాత ఫిజికల్, మెడికల్ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఇలా అవకాశం వచ్చిన వారు నాలుగేళ్లు సేవ చేయాలి. దీనిపై పూర్తి సమాచారం తెలుసుకుందాం..

జీతం వివరాలు:

• మొదటి సంవత్సరం ప్రతి నెలా రూ.30,000..రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏట రూ.40,000 వేతనం ఇస్తారు.

• ప్రతినెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్ ఫండ్ కి జమ చేస్తారు.

• మొత్తం నాలుగేళ్లు వ్యవధికి గానూ సేవానిధికి రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి వెళ్తుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. వడ్డీతో కలిసి సుమారు రూ.11.71 లక్షలు వస్తుంది. దీనిపై పన్ను ఉండదు.

• ఒకవేళ అగ్నివీరులు నాలుగేళ్లలోపే వైదొలిగితే వారి వేతనం నుంచి జమ అయిన మొత్తాన్నే చేతికి ఇస్తారు. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రోత్సాహం దక్కదు.

• వీరికి పింఛను, గ్రాట్యుటీ, డీఏ, మిలటరీ సర్వీస్ పే, పీఎఫ్ వంటివి వర్తించవు. ఎక్స్ సర్వీస్ మెన్గా కూడా పరిగణించరు.

వారినే శాశ్వత ఉద్యోగాల్లోకి:

• నాలుగేళ్ల వ్యవధి పూర్తి చేసుకున్న అగ్నివీరుల ఒక్కో బ్యాచ్ నుంచి గరిష్ఠంగా 25 శాతం మందిని నేవీలో సెయిలర్ హోదాతో శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు.

• ఇందుకోసం ఆ వ్యవధిలో ప్రతిభ, పనితీరును ప్రామాణికంగా తీసుకుంటారు. ఇలా అవకాశం పొందినవారు లెవెల్-3 వేతనంతో కెరియర్ ప్రారంభిస్తారు.

• అన్ని ప్రోత్సాహాలూ వర్తిస్తాయి. పదవీ విరమణ వయసు వరకు కొనసాగవచ్చు. అనంతరం పింఛనూ ఇస్తారు.

వయసు: 

సెప్టెంబరు 1, 2004 - డిసెంబరు 31, 2008 మధ్య జన్మించిన అవివాహితులు అర్హులు.

నేవీ ఎస్‌ఎస్‌ఆర్‌ అర్హతలు:

• ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

• ఇంటర్/ప్లస్2లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణలు అర్హులు.

• లేదంటే మెకానిక్/ ఎలక్ట్రికల్‌/ ఆటోమొబైల్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా లేదా మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు అర్హులు.

• ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

స్టేజ్‌-1 పరీక్ష:

• ఆన్లైన్లో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

• ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు ఉంటాయి.

• ఈ ప్రశ్నలన్నీ ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. మొత్తం నాలుగు సెక్షన్లు.అవి ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్‌ అవేర్‌నెస్‌.

• ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే ఉంటాయి.

• సిలబస్, నమూనా ప్రశ్నపత్రాలు నేవీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

• ప్రతి సెక్షన్‌లోనూ నిర్ణీత మార్కులు పొందడం తప్పనిసరి. నెగిటివ్ మార్కులు ఉంటాయి.

ఫిజికల్‌ టెస్టులు: 

స్టేజ్-1లో అర్హులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు.

మహిళలు, పురుషులు కనీసం 157 సెం.మీ. ఎత్తు.

1.6 కిలోమీటర్ల దూరాన్ని పురుషులు 6.30 నిమిషాలు, మహిళలు 8 నిమిషాల్లో పూర్తి చేయాలి.

పురుషులు 20 గుంజీలు, మహిళలు 15 గుంజీలు తీయాలి.

పుష్‌ అప్స్‌ పురుషులు 15, మహిళలు 10

బెంట్‌ నీ సిట్‌ అప్స్‌ పురుషులు 15, మహిళలు 10 తీస్తే అర్హత సాధిస్తారు.

స్టేజ్‌-2 పరీక్ష:

• ఫిజికల్ స్టాండర్ట్ టెస్టుల్లో అర్హులకు దీన్ని నిర్వహిస్తారు.

• ఇది కూడా స్టేజ్‌-1 మాదిరిగానే వంద మార్కులకు ఉంటుంది.

• ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. పరీక్ష వ్యవధి ఒక గంట. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో వీటిని అడుగుతారు.

• ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే ఉంటాయి.

• నమూనా ప్రశ్నపత్రాలు నేవీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

• ప్రతి సెక్షన్‌లోనూ నిర్ణీత మార్కులు పొందడం తప్పనిసరి. నెగెటివ్ మార్కులు ఉంటాయి.

• స్టేజ్‌-2లో అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

• ఇందులో విజయవంతమైనవారిని స్టేజ్‌-2 పరీక్షలో పొందిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఎంపిక చేస్తారు.

• వీరికి ఐఎన్‌ఎస్ చిలక సరస్సులో శిక్షణ ఇస్తారు. అనంతరం విధుల్లోకి తీసుకుంటారు.

ముఖ్యమైన సమాచారం:

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 10 సాయంత్రం 5 గంటల వరకు

పరీక్ష ఫీజు : జీఎస్టీతో కలిపి రూ.649

స్టేజ్-1 పరీక్ష: మే నెలలో

ఈ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకొండి: https://www.joinindiannavy.gov.in/

Comments

-Advertisement-