రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

స్వాతంత్ర్యం వచ్చినప్పడు తులం బంగారం అక్షరాలా రూ. 88.62.. 100 సంవత్సరాలలో 10 గ్రాముల బంగారం మార్కెట్ ధరలు ఇలా..

Gold rates telugu gold rates near nandyala, andhra pradesh today gold rate (22 carat) 1 gram gold rate today Today gold rate kurnool malabar Gold rate
Peoples Motivation

స్వాతంత్ర్యం వచ్చినప్పడు తులం బంగారం అక్షరాలా రూ. 88.62.. 100 సంవత్సరాలలో  10 గ్రాముల బంగారం మార్కెట్ ధరలు ఇలా..

• బంగారం ధరలకు రెక్కలు..

• తులం బంగారం ఖరీదు అక్షరాల రూ.లక్ష!

Gold rates telugu gold rates near nandyala, andhra pradesh today gold rate (22 carat) 1 gram gold rate today Today gold rate kurnool malabar Gold rate

బంగారం ధరలు చుక్కలంటుతున్నాయి. పది గ్రాముల పసిడి ధర రికార్డు స్థాయిలో లక్ష రూపాయలను తాకింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఒక దశలో లక్షా పది రూపాయలకు చేరింది. తర్వాత స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.1650 మేర పెరిగి రూ.99,800లకు చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటికే పది గ్రాముల పసిడి ధర రూ.20,850 మేర పెరిగింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు సహా అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ విలువ క్రమంగా తగ్గుతుండడం వంటి పరిణామాలు బంగారం ధరలు పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అటు వెండి ధరలు కూడా మండిపోతున్నాయి. కేజీ వెండి ధర ఇవాళ రూ.500 మేర పెరిగి రూ.98,500కు చేరింది.

ఇక తగ్గేదేలేదా?

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగియటంతో బంగారం ధర తగ్గే అవకాశం ఉందని భావించినప్పటికీ ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 3402 డాలర్లకు పైగా పలుకుతుండటంతో పుత్తడి రేటు అమాంతం పెరిగింది. గతేడాది ఏప్రిల్లో సుమారు రూ.75వేలు పలికిన బంగారం దాదాపు ఏడాది కాలంలోనే సుమారు రూ.25వేలు పెరుగుదల నమోదు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించటం గమనార్హం. 1990లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.3200 ఉండగా, 2000 నాటికి అది రూ.4400కు చేరింది. అయితే 2007లో ఏకంగా రూ.10,800 పలికిన బంగారం, 2011 నాటికి రూ.26,400కు చేరటం గమనార్హం. ఇక 2018 నాటికి రూ.31వేలకు చేరిన బంగారం, 2020 నుంచి భారీ పెరుగుదలను నమోదు చేసింది. 2023లో ఒకే ఏడాది సుమారు పదివేల వరకు పెరిగిన పుత్తడి ధరలు కొనుగోలుదారులను బెంబేలెత్తించాయి. ఇప్పుడు ఏకంగా తులం లక్ష రూపాయలకు దగ్గరకు వచ్చింది.

1925 నుండి 2025 వరకు 100 సంవత్సరాలలో  10 గ్రాముల బంగారం మార్కెట్ ధరలు ఇలా..

సంవత్సరం ధర రూపాయల్లో 

1925 సంవత్సరం- రూ. 18.75

1926 సంవత్సరం- రూ. 18.43

1927 సంవత్సరం- రూ. 18.37

1928 సంవత్సరం- రూ. 18.37

1929 సంవత్సరం- రూ. 18.43

1930 సంవత్సరం- రూ. 18.05

1931 సంవత్సరం- రూ. 18.18

1932 సంవత్సరం- రూ. 23.06

1933 సంవత్సరం- రూ. 25.05

1934 సంవత్సరం- రూ. 28.81

1935 సంవత్సరం- రూ. 30.81

1936 సంవత్సరం- రూ. 29.81

1937 సంవత్సరం- రూ. 30.18

1938 సంవత్సరం- రూ. 29.93

1939 సంవత్సరం- రూ. 31.75

1940 సంవత్సరం- రూ. 36.05

1941 సంవత్సరం- రూ. 37.43

1942 సంవత్సరం- రూ. 44.05

1943 సంవత్సరం- రూ. 51.05

1944 సంవత్సరం- రూ. 52.93

1945 సంవత్సరం- రూ. 62.00

1946 సంవత్సరం- రూ. 83.87

1947 సంవత్సరం- రూ. 88.62

1948 సంవత్సరం- రూ. 95.87

1949 సంవత్సరం- రూ. 96.18

1950 సంవత్సరం- రూ. 97.18

1951 సంవత్సరం- రూ. 98.00

1952 సంవత్సరం- రూ. 76.81

1953 సంవత్సరం- రూ. 73.00

1954 సంవత్సరం- రూ. 77.00

1955 సంవత్సరం- రూ. 79.00

1956 సంవత్సరం- రూ. 90.00

1957 సంవత్సరం- రూ. 90.00

1958 సంవత్సరం- రూ. ‌95.00

1959 సంవత్సరం- రూ. 102.00  

1960 సంవత్సరం- రూ. 111.00

1961 సంవత్సరం- రూ. 119.00

1962 సంవత్సరం- రూ. 119.00

1963 సంవత్సరం- రూ. 97.00

1964 సంవత్సరం- రూ. 63.00

1965 సంవత్సరం- రూ. 72.00

1966 సంవత్సరం- రూ. 84.00

1967 సంవత్సరం- రూ. 102.00

1968 సంవత్సరం- రూ. 162.00

1969 సంవత్సరం- రూ. 176.00

1970 సంవత్సరం- రూ. 184.00

1971 సంవత్సరం- రూ. 193.00

1972 సంవత్సరం- రూ. 202.00

1973 సంవత్సరం- రూ. 278.00

1974 సంవత్సరం- రూ. 506.00

1975 సంవత్సరం- రూ. 540.00

1976 సంవత్సరం- రూ. 572.00

1977 సంవత్సరం- రూ. 576.00

1978 సంవత్సరం- రూ. 685.00

1979 సంవత్సరం- రూ. 937.00

1980 సంవత్సరం- రూ. 1330.00

1981 సంవత్సరం- రూ. 1700.00

1982 సంవత్సరం- రూ. 1645.00

1983 సంవత్సరం- రూ. 1800.00

1984 సంవత్సరం- రూ. 1970.00

1985 సంవత్సరం- రూ. 2130.00

1986 సంవత్సరం- రూ. 2140.00

1987 సంవత్సరం- రూ. 2570.00

1988 సంవత్సరం- రూ. 3130.00

1989 సంవత్సరం- రూ. 3140.00

1990 సంవత్సరం- రూ. 3200.00

1991 సంవత్సరం- రూ. 3466.00

1992 సంవత్సరం- రూ. 4334.00

1993 సంవత్సరం- రూ. 4140.00

1994 సంవత్సరం- రూ. 4598.00

1995 సంవత్సరం- రూ. 4680.00

1996 సంవత్సరం- రూ. 5160.00

1997 సంవత్సరం- రూ. 4725.00

1998 సంవత్సరం- రూ. 4045.00

1999 సంవత్సరం- రూ. 4680.00

2000 సంవత్సరం- రూ. 4400.00

2001 సంవత్సరం- రూ. 4300.00

2002 సంవత్సరం- రూ. 5000.00

2003 సంవత్సరం- రూ. 5600.00

2004 సంవత్సరం- రూ. 5850.00

2005 సంవత్సరం- రూ. 7000.00

2006 సంవత్సరం- రూ. 8400.00

2007 సంవత్సరం- రూ. 10800.00

2008 సంవత్సరం- రూ. 12500.00

2009 సంవత్సరం- రూ. 14500.00

2010 సంవత్సరం- రూ. 18500.00

2011 సంవత్సరం- రూ. 26400.00

2012 సంవత్సరం- రూ. 29500.00

2013 సంవత్సరం- రూ. 29600.00

2014 సంవత్సరం- రూ. 28734.00

2015 సంవత్సరం- రూ. 26845.00

2016 సంవత్సరం- రూ. 29560.00

2017 సంవత్సరం- రూ. 29920.00

2018 సంవత్సరం- రూ. 31730.00

2019 సంవత్సరం- రూ. 36080.00

2020 సంవత్సరం- రూ. 48480.00

2021 సంవత్సరం- రూ. 50000.00

2022 సంవత్సరం- రూ. 53000.00

2023 సంవత్సరం- రూ. 60000.00

2024 సంవత్సరం- రూ. 80000.00

2025 సంవత్సరం- రూ. 99800.00( నేటి వరకు)

తేదీ.17.04.2025 వ నాటి వరకు ధర.

మీరు పుట్టిన సంవత్సరం 

మీకు పెళ్లైన సంవత్సరం 

మీకు పిల్లలు పుట్టిన సంవత్సరం 

మీ పిల్లల పెళ్లిళైన సంవత్సరం 

మీరు పదవీ విరమణ చేసిన సంవత్సరం లో బంగారం ధర ఎంత ఉందో చూడండి.ఈ రోజు ధర ఎంత ఉందో చూడండి. మీ మనవళ్లు మనవరాళ్లు పుట్టినప్పుడు వారి పెళ్లిళ్ల సందర్భంగా బంగారం ధర ఎంత ఉంటుందో ఊహించుకోండి. ముందు తరాల వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని దుబారా ఖర్చులు తగ్గించుకుని 

కొంచెం కొంచెం బంగారం కొని దాచండి. 

Comments

-Advertisement-