70 ఏళ్ల వారికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా
www.pmjay.gov.in login
pmjay.gov.in registration
PMJAY Card Download
PMJAY gov in Card Download
PMJAY apply
PMJAY beneficiary
pmjay.gov.in list
PMJAY
By
Mounikadesk
70 ఏళ్ల వారికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పీఎంజేఏవై వయో వందన' (ఆరోగ్య బీమా) సామాజిక, ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా 70 ఏళ్లు, ఆపైన ఉన్న వారందరికీ వర్తింపజేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. దీని కింద 70 ఏళ్లు దాటిన వారికీ రూ.5 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్రంలో ఇప్పటికే దారిద్య్ర రేఖకు దిగువనున్న వారందరికీ వయసుతో సంబంధం లేకుండా రూ.25 లక్షల వార్షిక పరిమితితో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా ఆరోగ్య బీమా అందుతోంది. 'పీఎంజేఏవై వయో వందన' అమలైతే దారిద్య్రరేఖకు ఎగువనున్న వారూ రూ.5 లక్షల మేర ఉచిత బీమా పొందే అవకాశం వచ్చింది. మరో వైపు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 70 ఏళ్ల వయస్సున్న వారికి రాష్ట్రం అందించే ఉచిత చికిత్సకు కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయి.
పీఏంజేఏవై వయో వందన కింద అమలు

వన్ టైం ఆప్షన్ ఎంచుకోవాలి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బీమా పథకంలో సభ్యులుగా ఉన్నవారు అందు లోనే కొనసాగుతారా? పీఎంజేఏవై పరిధిలోనికి వస్తారా? అన్న దానిపై నిర్ణయాన్ని తీసుకోవాలి. వన్ టైమ్ ఆప్షన్ ద్వారా ఈ పథకం కింద చేరేందుకు అవకాశాన్ని కల్పిస్తారు.
ప్రైవేటు బీమా పథకాల్లో, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సురెన్స్ స్కీమ్ పరిధిలో ఇప్పటికే ఉన్న వారూ పీఎంజేఏవై కింద అదనంగా ప్రయోజనం పొందొచ్చు.
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు తీసుకొచ్చే ప్రత్యేక యాప్ తో 70 ఏళ్లు దాటిన వారు సభ్యులుగా ఎప్పుడైనా చేరొచ్చు.
దరఖాస్తు చేసుకున్న వారికి జిల్లాల వారీగా కొత్త కార్డులు ఇస్తారు.
Comments