రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాష్ట్రంలో రూ.65వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్, 2.50 లక్షల మందికి ఉపాధి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

రాష్ట్రంలో రూ.65వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్, 2.50 లక్షల మందికి ఉపాధి

ప్రకాశం జిల్లా దివాకరపల్లి వద్ద రిలయన్స్ సీబీజీ ప్లాంట్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన

రిలయన్స్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్

రాష్ట్రంలో రూ.65వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్, 2.50 లక్షల మందికి ఉపాధి

వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు శ్రీకారం

Minister Nara Lokesh

కనిగిరిః రాష్ట్రంలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటుచేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ప్లాంట్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ, టీఎస్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయోఎనర్జీ సీఈవో హరీంద్ర కే.త్రిపాఠితో కలిసి భూమిపూజ చేశారు. దివాకరపల్లి వద్ద 475 ఎకరాల్లో, రూ.139 కోట్ల పెట్టుబడితో, 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సీబీజీ ప్లాంట్ ను ఏర్పాటుచేస్తోంది. రిలయన్స్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా తొలిప్లాంటుకు బుధవారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో రూ.65వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్లను స్థాపించనుంది. తద్వారా 2.50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ దేశంలో 4 సీబీజీ హబ్ లను ఏర్పాటుచేయనుండగా అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటుచేస్తోంది. ముందుగా ప్లాంట్ ఆవరణలోకి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ మంత్రి నారా లోకేష్ ముందుకు సాగారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, సీఎస్ కె.విజయానంద్, కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ఎమ్.అశోక్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, దర్శి ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, దర్శి మాజీ ఎమ్మెల్యే ఎన్. పాపారావు, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజి, స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-