రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కోటి మంది లబ్దిదారులు దాటే విధంగా రెండో విడత ధీపం-2 అమలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

కోటి మంది లబ్దిదారులు దాటే విధంగా రెండో విడత ధీపం-2 అమలు

అర్హులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets

అమరావతి, ఏప్రిల్ 1: కోటి మంది లబ్దిదారులు దాటే విదంగా రెండో విడత ధీపం-2 పథకాన్ని రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభించడం జరిగిందని, అర్హులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నాల్గోబ్లాక్ ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రప్రథమంగా నెరవేర్చిన హామీ ధీపం-2 అని, ఈ పథకాన్ని గత ఏడాది అక్టోబరు 31 న దీపావళి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాపురంలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని పెద్ద ఎత్తున 99.03 లక్షల మంది సద్వినియోగం చేసుకోవడం జరిగిందని, దాదాపు రూ.760 కోట్లు లబ్దిదారుల ఖాతాల్లోని నేరుగా జమచేయడం జరిగిందన్నారు. ఈ మూడు మాసాల కాలంలో అదనంగా రెండు లక్షల గ్యాస్ కనెక్షన్లు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. రెండో విడత ధీపం-2 పథకాన్ని నేటి నుండి అమలు చేయడం జరుగుచున్నదని, ఇకెవైసి, అర్హత విషయంలో ఎటు వంటి సమస్యలు ఎదురైనా వాట్సాప్, ఆన్లైన్ ద్వారా వెంటనే వాటిని నివృత్తి పర్చుకునే వెసులు బాటు కల్పించండ జరిగిందన్నారు. సుప్రీకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇకెవైసి నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మొత్తం 4,24,59,028 మంది లబ్దిదారులకు గాను ఇప్పటి వరకూ 93 శాతం అంటే 3,85,74,194 మంది లబ్దిదారుల ఇకెవైసి పూర్తి చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు మిగిలిన 3 శాతాన్ని కూడా ఈ మాసాంతాని కల్లా పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇకెవైసి నమోదు విషయంలో లబ్దిదారులకు ఎటు వంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకై గ్రామ, వార్డు సచివాలయాల్లోని మొబైల్ యాప్, ఇ-పోస్ మిషన్ ద్వారా ఇకెవైసి నమోదు చేసుకునే అవకాశాన్ని క్షేత్ర స్థాయిలోనే కల్పించడం జరిగిందన్నారు. 

మద్యాహ్న భోజన పధకం క్రింద నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ

ఈ విద్యా సంవత్సరం నుండి మద్యాహ్న భోజన పథకం క్రింద నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూన్ నుండి 44,394 ప్రభుత్వ పాఠశాలలకు, 3,938 వసతి గృహాలకు నాణ్యమైన సన్నని బియ్యాన్ని ప్రత్యేక ప్యాకింగ్ తో నెల నెలా కొరియర్ ద్వారా పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు ప్రత్యేకించి ఐదు గోదాములను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 


రభీలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం…

నేటి నుండి రభీ సీజన్ ప్రారంభం అయిందని, ఈ రభీలో దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యాన్ని నిర్థేశించుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. కేంద్రం అంచనాల మేరకు రాష్ట్రంలో ఈ రభీలో దాదాపు 13.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్రంలో పండించడం జరుగుతుందని, అందులో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్దం అవుతున్నామన్నారు. ఇందుకై 2,900 రైతు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కేంద్రాల్లో దాదాపు 12 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

అదే విధంగా ఖరీఫ్ లో 35,93,443 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే సొమ్ము చెల్లిస్తామని మాట ఇచ్చి కేవలం 24 గంటల్లోనే రూ.8,279 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమచేరుడం జరిగిందన్నారు. దేశంలోనే మొదటి సారిగా వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందని, రైతులు తమ ఇష్టం వచ్చిన మిల్లులలోనే తమ ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. దాదాపు 70 వేల మంది రైతులు ఈ వాట్సాప్ ద్వారా తమ వివరాలను పంపడం జరిగిందని, వారిలో దాదాపు 16 వేల మంది పూర్తి స్థాయిలో వాట్సాప్ ద్వారా తమ ఇష్టం వచ్చిన మిల్లుల్లో ధాన్యాన్ని విక్రయించుకోవడం జరిగిందన్నారు. జిపిఎస్ విదానాన్ని తీసుకురావడం జరిగిందని, గోతాలకు కూడా ఎటు వంటి లోటు లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 

అయితే ఇదే ఖరీప్ సీజన్ లో గత ప్రభుత్వ హయాంలో కేవలం 29 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి, రూ.6,500 కోట్లను చెల్లించడం జరిగిందన్నారు. మొత్తం మీద గతంతో పోల్చుకుంటే తమ ప్రభుత్వం 20 శాతం ఎక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 4.95 లక్షల మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తే తమ ప్రభుత్వం నేటికి 5.60 లక్షల రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 2023 మరియి 2024 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వం ఒక్క బస్తా ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదని, అయితే తమ ప్రభుత్వం నేటికి ఈ నెల్లూరు జిల్లాలో 75,410 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా పల్నాడు జిల్లాలో గతంలో 60 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం తమ ప్రభుత్వం 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే తమ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో 23 శాతం, గుంటూరు జిల్లాలో 639 శాతం మరియు బాపట్ల జిల్లాలో 213 శాతం అదికంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రేషన్ కార్డుల స్థానంలో రైస్ కార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు ఆమోదంతో త్వరలో పంపిణీ చేయనున్నట్లుమంత్రి తెలిపారు. క్యూఆర్ కోడింగ్ కూడా ఈ రైస్ కార్డులకు ఉంటుందన్నారు. అదే విధంగా పిడిఎస్ రైస్ అక్రమ రవాణా పై ఉక్కు పాధం మోపడం జరుగుతుందని, అందుకు బాద్యులైన వారిపై పిడి చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగువతి నిబందనలను సరళీకృతం చేయడం వల్ల తెలంగాణా ప్రభుత్వం కాకినాడ పోర్టు నుండి దాదాపు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయడం జరుగుతున్నదని మంత్రి తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Comments

-Advertisement-