ఇక నుంచి 10 నిమిషాలల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి
ఇక నుంచి 10 నిమిషాలల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విభాగంలో స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం..
ఈ నెల 10 ప్రారంభం - వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ప్రారంభంలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. పత్రాల రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురానున్నట్లు ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో మంత్రి తెలిపారు.
హైదరాబాద్‌లోని అజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం, మేడ్చల్, మహబూబ్ నగర్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ పోర్టు, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూలుతో సహా మొత్తం 22 చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు.
10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి:
తెలంగాణ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏప్రిల్ 10 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తొలుత ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నూతన విధానంతో 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందని అన్నారు.
గతంలో గంటవరకు సమయం పట్టేది:
ప్రస్తుతం ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు దాదాపు 45 నిమిషాల నుంచి గంటవరకు సమయం పడుతోంది. ఆ సమయాన్ని మరింత తగ్గించేందుకు స్లాట్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.