రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి

కొత్తగా 13 డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లు 

అవసరాని బట్టి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో వర్చువల్ వైద్యసేవలు

వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

CM Nara Chandrababu Naidu

అమరావతి, ఏప్రిల్ 4 : రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్ధ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 100 పడకలకు పైగా సామర్ధ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయని, మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మాణం జరిగేలా త్వరితిగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలని, ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... రాష్ట్రంలో వైద్యసేవల్ని మరింత విస్తృత పరచాలని చెప్పారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ దేశాలన్నీ వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పారు. 

వర్చువల్ వైద్య సేవలు 

విద్య-వైద్య రంగాలు తమ ప్రాధామ్యాలుగా చెప్పిన ముఖ్యమంత్రి...గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు చెప్పారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలన్నారు. అన్యారోగ్యం బారిన పడిన తర్వాత వైద్యసేవలు అందించే పరిస్థితి నుంచి... ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఆహారపు అలవాట్లను, జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటి వ్యాధుల నుంచి చాలావరకు బయటపడవచ్చన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రక్రియపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. 

కొత్తగా 13 డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లు 

రూ.32.5 కోట్లతో 25 డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లను బలోపేతం చేయడంతో పాటు, కొత్తగా మరో 13 డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఏజెన్సీ ఏరియాలోని పీహెచ్‌సీల్లో వైద్య ఖాళీల భర్తీ, విజయనగరంలో కొత్తగా 8 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, ఎన్టీఆర్, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో డయాలసిస్ మెషిన్లు పెంచడం, కొవ్వూరు-నిడదవోలు సీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేయడం తదితర అంశాలపైన మార్గదర్శకాలు జారీ చేశారు. 

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ 

కుప్పంలో అమలు చేస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అభివృద్ధి చేసిన వినూత్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం డిజిటల్ నెర్వ్ సెంటర్ (DiNC) పురోగతి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ అందించడానికి డిజిటల్ నెర్వ్ సెంటర్‌ దోహదపడుతుంది. దేశంలోనే అత్యధికంగా 4.47 కోట్ల (88 శాతం) మందికి రాష్ట్రంలో అభా కార్డులు జారీ అయ్యాయి. అలాగే, పీఎం జన్మాన్‌లో భాగంగా టీబీ ఎలిమినేషన్ కింద 82,693 గిరిజనులకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయగా 5,072 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 10,11,461 మంది గిరిజనులకు స్క్రీనింగ్ చేయగా 1,977 మందికి సికిల్ సెల్ ఎనీమియా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో 95.60 శాతం జనన, మరణాల నమోదు జరిగింది. 13,26,621 శిశు ఆధార్‌లు జారీ అయ్యాయి.

Comments

-Advertisement-