FREE GAS CYLINDER: అలెర్ట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఈ నెలాఖరు వరకే
FREE GAS CYLINDER: అలెర్ట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఈ నెలాఖరు వరకే
ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు..
గ్యాస్ తీసుకున్న 48 గంటల్లోపే ఖాతాలో డబ్బులు జమ..
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దీపం-2 పథకంలో భాగంగా మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ఇప్పటి వరకూ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఇప్పటికే ప్రకటించారు. ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇచ్చే ఈ స్కీమ్ను గతేడాది చివరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఏప్రిల్ నుంచి జులైౖ, ఆగస్టు నుంచి నవంబరు, డిసెంబరు నుంచి మార్చి మధ్యలో, అంటే నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు.
ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం-2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని ఆహారం పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. కాగా, ఇప్పటివరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల తెలిపారు.
సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకుంటున్న కూటమి సర్కార్..
ప్రతి ఏడాది ఇలా ఉచిత గ్యాస్..
ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు
ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో దీపం 2 కింద ప్రారంభమైన ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకానికి తొలుత రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులతో పోలిస్తే అర్హుల సంఖ్య తక్కువగా ఉండేది. ఆంధ్రప్రదేశ్లో 1.54 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గతేడాది నవంబర్ లెక్కల ప్రకారం 1.08 కోట్ల కనెక్షన్లు ఉచిత సిలిండర్‌కు అర్హత పొందాయి. కొంతమంది ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ అనుసంధానం లేకపోవడం వలన లబ్ధిదారుల సంఖ్య అప్పట్లో తగ్గింది. ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగి ఉండొచ్చు.