చదవడానికి ఏకాగ్రత అవసరమే..
చదవడానికి ఏకాగ్రత అవసరమే..
నేటి డిజిటల్ యుగంలో "బుకింగ్ కల్చర్ పెరుగుతూ, రూడింగ్ కల్బర్ సన్నగిల్లుతోంది". చదవడం అనే కళ క్రమంగా కళావిహీనం అయిపోతున్నది. చదవడం అంటే తెలియని విషయాలను తెలుసుకోవడం, అజ్ఞాన చీకట్ల నుంచి నుంచి జ్ఞాన వెలుగుల వైపు అడుగులు వేయడం. చదవడానికి ఏకాగ్రత కావాలి. చదవడాన్ని అమితంగా ఇష్టపడితే ఏకాగ్రత దానంతట అదే వస్తుంది. సాల్ట్ ఫోన్ వచ్చాక సామాజిక మాధ్యమాల్లోంచి బయట. పడడం అసాధ్యంగా తోస్తున్నది. ప్రతి నెల లేదా సంవత్సరంలో కొన్ని పుస్తకాలు చదవాలనే నియమం పెట్టుకొండి. పుస్తకాలు కొనడం అలవాటు చేసుకోవాలి. ప్రపంచ పోకడలకు అనుగుణంగా మనం ఎదగడానికి అవసరమైనది చదువు మాత్రమే. విద్యార్థులు పాఠ్య పుస్తకాల చదువుకు తప్పనిసరిగా సమయం ఇస్తారు. వారు ఇతర పుస్తకాలను కూడా చదవడం అలవాటు "స్వానుభవంతో నేర్చుకున్న వారు మూర్ఖులు, ఇతరుల అనుభవాలతో నేర్చుకున్న వారు విజ్ఞానవంతులు" అనే నినాదం విన్నాం. "నేను పుస్తకాలు కొన్న తర్వాత డబ్బు మిగిలితేనే తినుబండారాలు కొంటాను" అనే విధంగా పుస్తకాలు కొనడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చదివితే తెలివి పెరుగుతుంది. తెలివితో సరైన ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగంతో జీవితంలో స్థిరత్వం
పెరుగుతుంది. స్థిరత్వంతో సమాజంలో మంచి గౌరవం బభిస్తుంది. పుస్తకాలు కొనడం, చదవడానికి సమయం ఇవ్వడం నుంచి ప్రతిఫలాలను వస్తుందని తెలుసుకోవాలి. పుస్తకాలు కొని చదవకపోతేనే మనం వెచ్చించిన ధనం వృథా అవుతుంది. ఇంట్లో పుస్తకాలు ఉంటే రోజు ఒక గంటైనా వరవడం మంచిదని గమనించాలి. ప్రతి ఏట వంద లేదా పైన పుస్తకాలు చదువే విధంగా మన జీవనశైలి ఉండాలి. వారాంత నెలవుల్లో చదవడానికి కొంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. మీ జీవనశైలిని బట్టి చదవడానికి సమయం కేటాయించాలి. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసినట్లయితే ప్రయాణ సమయాన్ని పుస్తడ పఠనానికి కేటాయించవచ్చు. బిడ్డకు పాలు పట్టే తల్లి కూడా పుస్తకాలను చదవవచ్చు. మనం తినేటప్పుడు, కార్యాలయాల్లో పని ప్రదేశంలో, చివరికి నాష్ రూమ్లో కూడా ఆసక్తిగల వారు చదవవచ్చు. వారానికి 6 నుంచి 8 గంటలు చదివే అలవాటు ఉన్న వారు ఏడాదికి దాదాపు వంద పుస్తకాలు చదవవచ్చు. స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ తెరలపై సమయాన్ని వృథా చేయడం కన్న పుస్త పడరానికి సమయం ఇవ్వడం సముచితంగా ఉంటుంది. అందరు అన్ని రకాల పుస్తకాలను చదువలేరు. మనకు ఆసక్తి ఉన్న రంగాలకు సుబంధించిన పుస్తకాలను చదవడం మనకు ఇష్టంగా
ఉంటుంది. ప్రముఖుల జీవిత చరిత్రలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, సమకాలీన సమస్యల గూర్చి చర్చించే పుస్తకాలు, మనం ఎంచుకున్న రంగానికి లేదా వృత్తికి సంబంధించినవి, ప్రముఖ నవలలు, పేరెన్నికగన్న రచనలు లాంటివి ఏదైనా చదవవచ్చు. కౌమార దశ నుంచే చదవదాన్ని ముఖ్య అలవాటుగా చేసుకోవాలి. విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలను చదవడం ఒక నుంచి కళ. పుస్తకాలు చదివేటప్పుడు. ముఖ్యమైన విషయాలను వోట్ చేసుకోవడం మరవరాదు. పాక్షికంగా చదివిన పుస్తకం పేజీని సేవర్ పెట్టి గుర్తుంచుకోండి. మనకు నచ్చిన కొటేషన్లను నోటి చేసుకోవాలి. చదవడానికి నియను నిబంధనలు, సరైన సమయం సందర్భం అనేవి ఉండవు. పాఠకుడికి ఆసక్తి ఉంటే ఎడారిలో లేదా ఎండల్లో కూడా చదవవచ్చు. చదవడం వల్ల మనో విస్తృతి పెరుగుతుంది. నమాజం అర్ధం అవుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ప్రజాదరణ పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. చదివి అర్ధం చేసుకున్న విషయాలను ఆచరణలో పెడితే మీ వ్యక్తిత్వం మరింత ఇనుమడిస్తుంది. పుస్తకం హస్తభూషణమే కాదు మస్తిష్క వికాస సాధనం కూడా అని గుర్తుంచుకోవాలి. చదువును దుకాణంలో కొనడాని వీలు కాదు కాని పుస్తకాన్ని కొని జ్ఞానాన్ని ఆర్జించవచ్చుని మరిచి పోరాడు.