న్యాయబద్ధంగా పునర్విభజన ప్రక్రియ
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
By
Mounikadesk
న్యాయబద్ధంగా పునర్విభజన ప్రక్రియ
2026వ సంవత్సరం సమీపిస్తున్న కొద్దీ పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన సమస్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ వివాదాస్పదంగా మారుతున్నది. నియోజక వర్గాలను స్తంభింపచేసిన గడువు ముగిసే సంవత్సరం ఇదే. 2026 తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కలతో తదుపరి దఫా పునర్విభజన తప్పక చేపట్టవలసి వుంటుంది. 1976 ఎమర్జెన్సీలో ఆమోదించిన 42వ రాజ్యాంగ సవరణ ఈ విధంగా స్తంభింప చేయాలని తొలుత నిర్ణయించింది. తరువాత వాజ్ పేయి హయాంలో ఈ స్తంభనను 2026 వరకూ పొడిగించారు. నియోజకవర్గాల పునర్విభజనలో రెండు అంశాలున్నాయి. 1. ప్రతి పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కుల తర్వాత అక్కడ నమోదైన జనాభాను జాతీయ జనాభాతో పోల్చి ఆ నిష్పత్తి ఆధారంగా ప్రతి రాష్ట్రానికి వచ్చే పార్లమెంటరీ సీట్ల సంఖ్య, అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పునఃపరిశీలన చేయడం. 2. జనాభా రీత్యా సాపేక్షంగా సమాన స్థాయిలో వుండేలా పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాదేశిక సరిహద్దులను పున:నిర్ణయించడం. 1976 రాజ్యాంగ సవరణ, తత్పర్యవ సానంగా వాణ్వియి ప్రభుత్వం 2001లో చేసిన సవరణ కారణంగా 1981, 1991, 2001 దశాబ్దాల జనాభా లెక్కల తర్వాత పునర్విభజన కమిషన్లేవీ ఏర్పాటు కాలేదు. ఈ స్తంభన 2026తో ముగుస్తుంది గనక రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ సమస్య ముందుకొచ్చింది. తాజా జనాభా ఆధారంగా పునర్విభజన జరిపితే దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గి పోతుందనేది ఇక్కడ ప్రాథమికంగా వస్తున్న అభ్యంతరం, రాష్ట్రాల జనాభా పెరుగుదల రేట్లలో హెచ్చు తగ్గులే ఈ వ్యత్యాసానికి కారణం అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు సమర్థవంతమైన జనాభా నియంత్రణ చర్యలతో పెరుగుదల రేట్లు బాగా తగ్గించగలిగాయి. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలలో ఇది చెప్పుకోదగినంతగా పెరిగింది. దీని ఫలితమేమంటే జనాభాను అదుపు చేయడంలో జయప్రదమైన రాష్ట్రాలకు శిక్ష విధించబడుతుంది మరో వంక పని చేయని వాటికి ఎక్కువ సీట్లను బహూకరించి నట్లవుతుంది. పంజాబ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కూడా కొన్ని సీట్లు కోల్పోతాయని అందనా వేస్తున్నారు. జనాభా నియంత్రణకు నాయకత్వం వహించిన దక్షిణాది రాష్ట్రాలు. పునర్విభజనకు జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవడాన్ని అందుకే వ్యతిరేకిస్తున్నాయి. మీడియాలో కథనాలు వస్తున్నట్టుగా మొత్తం లోక్సభ సీట్ల సంఖ్యను ఇప్పుడున్న 543 నుంచి 848కి పెంచినా జనాభా ప్రాతిపదికన అయితే అయిదు దక్షిణాది రాష్ట్రాలకు 40 సీట్లు మాత్రమే పెరుగుతాయి. అదే మరోవైపున ఉత్తరప్రదేశ్ ఒక్కదానికే 63 సీట్లు, బీహార్కు 39 సీట్లు పెరుగుతాయి. ఈ విధంగా సీట్ల పంపిణీలో ఈ అసమానతలనే దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తాజా జనాభా లెక్కల ప్రాతిపదికన పునర్విభజన ప్రక్రియ చేపట్టడం పట్ల వ్యక్తమవుతున్న ఈ వ్యతిరేకతకు సమాధానం గానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఏ దక్షిణాది రాష్ట్రానికీ సీట్లు తగ్గబోవనీ పైగా నిష్పత్తి సూత్రంతో పెరుగు తాయనీ పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన కూడా అస్పష్టమైందిగానే వుంది. ఎందుకంటే నిష్పత్తి సూత్రం ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటారా లేక ప్రస్తుత సీట్ల నిష్పత్తి ప్రకారమా అనే స్పష్టత లేదు. జనాభా ప్రకారమే అయ్యేట్టయితే అప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లలో నిష్పత్తికి మించి వాటా వస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో అనుసరించదగిన అత్యుత్తమ పద్ధతి ఏమంటే ప్రస్తుతం ఒక్కో రాష్ట్రానికి వున్న సీట్ల నిష్పత్తికి అనుగుణంగా పెంపుదల చేయడం. దీనివల్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించేందుకు మొత్తం సీట్ల సంఖ్య పెంచడంతో పాటు రాష్ట్రాల మధ్యలో ప్రస్తుతం వున్న పీట్ల నిష్పత్తిని కాపాడినట్లవుతుంది. జనాభా పెరుగుదల ప్రకారంగాక ఇప్పుడున్న సీట్ల కేటాయింపు మేరకే ప్రతి రాష్ట్రం అదనంగా సీట్లు పొందుతుంది. ఉదాహరణకు మొత్తం సీట్లు 800కు పెంచితే అప్పుడు తమిళనాడుకు వున్న 39 స్థానాలకు మరో 18 తోడై 57కు చేరుతుంది. ఆ విధంగా మొత్తం సీట్ల సంఖ్యలో ఇప్పుడున్న నిష్పత్తి అలాగే వుంటుంది. ఇదే ఫార్ములా ప్రకారం చేస్తే కేరళకు తొమ్మిది సీట్లు ఎక్కువగా పెరిగి 29కి చేరతాయి. ఇప్పుడు 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్కు 38 పెరిగి 118 అయితే...25 సీట్ల పెంపుతో బీహార్కు 79 అవుతాయి. ఇవి ఇప్పుడు వాటికి వున్న దామాషా కొనసాగింపే అవుతాయి. కనుక మరింత మెరుగైన ప్రాతినిధ్యం కోసం మొత్తం సీట్ల సంఖ్యను పెంచే సందర్భంలో ఏ రాష్ట్రం కూడా వున్న సీట్లను కోల్పోకుండా చూసినట్లు అవుతుంది. ఏదైనా ఈ పద్ధతిపై ఏకాభిప్రాయం కుదరని పక్షంలో వుండే ఒకే ఒక ప్రత్యామ్నాయం పునర్విభజన ప్రక్రియను మరో పాతికేళ్లు వాయిదా వేయడమే. ఈ సమస్య చర్చించేందుకూ ఒక ఉమ్మడి వైఖరికి వచ్చేందుకుగాను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మార్చి 22న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పంజాబ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ నుంచి ప్రధాన పార్టీలనూ ఆహ్వానించారు. ఈ సంయుక్త సమావేశంలో
Comments