బెట్టింగ్ లను, నిర్వహించిన, ఆడిన, ప్రోత్సహించినా, చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు
బెట్టింగ్ లను, నిర్వహించిన, ఆడిన, ప్రోత్సహించినా, చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు
తల్లి దండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలి
-కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్
కాకినాడ, (పీపుల్స్ మోటివేషన్):-
ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో, బెట్టింగ్ పై ప్రత్యేక నిఘా, దాడుల కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ
జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
క్రికెట్ మ్యాచ్ లను వినోదం కోసం మాత్రమే చూడాలి తప్ప కుటుంబాలలో విషాదం నింపేలా ఉండకూడదు. ఆన్లైను బెట్టింగు యాప్లతో, బెట్టింగ్ జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతను కోరారు. ఒక్కసారి బెట్టింగ్ లకు అలవాటు పడితే వాటి నుండి బయటకు రావడం కష్టతరం అవుతుందన్నారు. బెట్టింగ్ లో ఒకసారి ఆదాయం వచ్చినా పలుమార్లు నష్ట పోవడం జరుగుతుందన్నారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
యువత, విద్యార్థులు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా చదువుపై, తమ ఉజ్వల భవిషత్తు పై దృష్టి పెట్టి, తమ తల్లిదండ్రుల ఆశయాల సాధన కోసం ఉన్నతంగా జీవించాలన్నారు.
తల్లి దండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలి
◼️ గతంలో బెట్టింగ్ నిర్వహించిన వారిపై నిఘా ఉంచామన్నారు.
◼️ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్ కూడా నేరమే.
◼️జిల్లాలో ఎవరైనా బెట్టింగులను నిర్వహించిన వారిపై ఆంధ్రప్రదేశ్ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడమే కాక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అవసరం మేరకు suspect షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
◼️ జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ లు జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 112/100 కు (లేదా) సమీపంలో గల పోలీస్ స్టేషన్ కు/ జిల్లా పోలీస్ wattsapp హెల్ప్ లైన్ నెంబర్ 9494933233 కు సమాచారం అందించాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఈ రోజు ఓ ప్రకటనలో తెలిపారు.