రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Balabhadrapuram: బలభద్రపురంలో 31 వైద్య బృందాలతో క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

Balabhadrapuram: బలభద్రపురంలో 31 వైద్య బృందాలతో క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షలు 

ప్రస్తుతం క్యాన్సర్ ఆందోళనకర స్థాయిలో లేదు అదుపులోనే ఉంది

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

-రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్

Minister Satya Kumar Yadav

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అనపర్తి శాసన సభ్యులు బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవవడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నట్టు సభ దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో సమగ్ర క్యాన్సర్ సర్వేను ప్రారంభించడం జరిగిందన్నారు.ఈఅంశంపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరోగ్య శాఖ ఇప్పటికే నవంబర్, 2024 నుండి నోటి, రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్‌ నిర్ధారణ చేసే సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్‌ను నిర్వహిస్తోందని ఇప్పటికే 47% జనాభాను కవర్ చేయడం జరిగిందని తెలిపారు.బలభద్రపురం గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షలకై 31 వైద్య బృందాలను నియమించగా వారిలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలు (MLHPలు), సహాయక నర్సులు (ANMలు), మరియు గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ASHAలు) ఉన్నారు.వీరికి ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHCలు) వైద్యులు మరియు కాకినాడ వైద్య కళాశాల,జిఎస్ఎల్ వైద్య కళాశాల నిపుణులు తగిన సహాయం అధిస్తున్నాయని తెలిపారు.

ప్రసుతం క్యాన్సర్ ఆందోళనకర స్థాయిలో లేదని కావున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.ఫింక్ రిబ్బన్ కార్యక్రమం ద్వారా క్యాన్సర్ పై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని మంత్రి పేర్కన్నారు.

బలభద్రపురం గ్రామంలో 3,500 గృహాలుండగా 10,800 మంది జనాభా ఉండగా వైద్య బృందాలు 2025 మార్చి 22 మరియు 23 తేదీలలో 8,830 మంది వ్యక్తులను కవర్ చేస్తూ 2,803 గృహాలను సర్వే చేయడం జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.ఈ సర్వే ద్వారా అనుమానిత క్యాన్సర్ కేసులను గుర్తించడం,గత మూడేళ్ళుగా క్యాన్సర్ వల్ల సంభవించిన మరణాలను నమోదు చేయడం వంటివి చేస్తున్నారన్నారు.సర్వే అనుమానిత క్యాన్సర్ కేసులతో 38 మంది వ్యక్తులను గుర్తించగా అనుమానిత కేసులలో సుమారు10% నుండి 15% వరకు క్యాన్సర్‌కు పాజిటివ్‌గా ఉంటుందని గమనించడమైందని తెలిపారు.నోటి క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ ఒక్కొక్కటి 6 కేసులుగా ఉండగా,7 మందిలో గర్భాశయ క్యాన్సర్ అనుమానిత కేసులుగా,2 కేసుల్లో మెదడు క్యాన్సర్,3 కేసుల్లో ఊపిరి తిత్తుల అనుమానిత క్యాన్సర్ కేసులుగా నమోదు చేయడం జరిగిందని చెప్పారు.అలాగే 14 మంది వ్యక్తులకు బహుళ రకాల క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించబడిందని తెలిపారు.సర్వే బృందాలు 17 మంది క్యాన్సర్‌ రోగులు చికిత్సలు పొందుతున్నట్టు గుర్తించగా వారిలో రొమ్ము క్యాన్సర్ (5గురు), బహుళ క్యాన్సర్ రకాలు (9మంది),మెదడు క్యాన్సర్ మరియు రక్త క్యాన్సర్ కు సంబంధించి మరో ముగ్గురు ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు.గతంలో నిర్ధారించబడిన కేసుల్లో 15 మంది తమ క్యాన్సర్ చికిత్సను విజయవంతంగా పొందారని ఈ కేసుల్లో ఎక్కువ మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌,రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్‌కు చికిత్సలు పొందినట్టు చెప్పారు.గత మూడు సంవత్సరాలలో 19 క్యాన్సర్ సంబంధిత మరణాలు సంభవించినట్టు ఈసర్వే బృందాలు గుర్తించాయని తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా క్యాన్సర్ భారం క్రమంగా పెరుగుతున్నట్లు గమనించడ మైదని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.రాష్ట్రంలో నోటి మరియు రొమ్ము క్యాన్సర్‌లకు 18+ వయస్సు గల మొత్తం జనాభాకు మరియు గర్భాశయ క్యాన్సర్‌లకు 30+ వయస్సు గల మహిళలకు సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్‌ను చేపట్టిడం జరిగిందని అన్నారు. మొత్తం 4.09 కోట్ల మందికి స్కీనింగ్ చేయాలని లక్ష్యం కాగా ఇప్పటికే 1.93 కోట్ల జనాభా స్క్రీనింగ్‌ పూర్తి చేసి 1,45,649 అనుమానిత కేసుల్లో 95,263 మందిని పిహెచ్సి వైద్య బృందాలు పరీక్షించాయని తెలిపారు.కాగా రాష్ట్రంలో 2022 నుండి 2025 వరకు 1,13,363 క్యాన్సర్ కేసులు చికిత్సలు అందించగా వాటిలో అత్యధిక కేసులు కాకినాడ జిల్లాలో 5,931 (5.23%) కాగా మిగతావి విజయనగరం,శ్రీకాకుళం, గుంటూరు మరియు విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

ఈసమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణ బాబు మాట్లాడుతూ క్యాన్సర్ అనేది నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాధని క్యాన్సర్ వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించ గలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయని సకాలంలో తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ణప్తి చేశారు.క్యాన్సర్ అనుమానిత కేసులుగా గుర్తించిన వారికి మెరుగైన చికిత్సలకై విశాఖపట్నం హోమీ బాబా క్యాన్సర్ కేంద్రం ద్వారా గాని లేదా ఎన్టిఆర్ వైద్య సేవలో ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని వారికే ఆప్సన్ ఇవ్వడం జరిగిందని అన్నారు.అంతేగాక క్యాన్సర్ కు సంబంధించి ఎన్టిఆర్ వైద్య సేవలో 256 ప్రొసీజర్లను పొందుపర్చడం జరిగిందని తెలిపారు. ఈమీడియా సమావేశంలో డిఎంఇ డా.నర్సింహ పాల్గొన్నారు.

Comments

-Advertisement-