రూ. 16 లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
రూ. 16 లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ద్విచక్ర వాహనాలు సులువుగా చోరీ చేసే నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు ఈ ముఠాను సంయుక్తంగా పట్టుకున్న అనంతపురం సిసిఎస్, వన్ టౌన్ & 3 టౌన్ పోలీసులు
జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఈరోజు మీడియాకు వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి
నిందితుల అరెస్టు వివరాలు :
1) వనరస జితేంద్ర @ సిద్దు, వయస్సు 40 సం., భవాని నగర్, అనంతపురం
2) షేక్ తౌహీద్ @ సోనూ, వయస్సు 20 సం., ఇందిరా గాంధీ నగర్, అనంతపురం
3) మైనర్ ( సి.డబ్ల్యు.సి ముందు హాజరు పరుచనున్నారు)
4) నల్ల నాచప్పగారి గణేశ్, వయస్సు 22 సం., ముత్యాల చెరువు గ్రామం, కదిరి మండలం, శ్రీ సత్య సాయి జిల్లా.
5) నూర్ మహమ్మద్, వయస్సు 23 సం., ముత్యాల చెరువు గ్రామం, కదిరి మండలం, శ్రీ సత్య సాయి జిల్లా
స్వాధీనం చేసుకున్నవి :
వివిధ కంపెనీలకు చెందిన 18 ద్విచక్ర వాహనాలు ( వీటి విలువ సుమారు రూ. 16 లక్షలు ఉంటుంది )
ముఠాలుగా ఏర్పడి... వేర్వేరుగా చోరీలకు పాల్పడి
ప్రస్తుతం పట్టుబడిన ఐదుగురు వేర్వేరుగా 3 ముఠాలుగా ఏర్పడి అనంతపురం, కడప జిల్లాలలో ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లారు. వీరు జూదం, తాగుడు, తదితర వ్యసనాలకు అలవాటుపడ్డారు. ఇందుకు సరిపడా సంపాదన లేదు. తమకున్న చెడు వ్యసనాలు తీర్చుకునేందుకు సులువుగా డబ్బు సంపాదించాలని భావించారు. దొంగతనాలు చేస్తే డబ్బు బాగా సంపాదించవచ్చని జల్సాలకు బానిసలైన వీరు వేర్వేరుగా వాహనాల చోరీలకు పాల్పడుతూ వచ్చారు.
** మొదటి ముఠా :
వనరస జితేంద్ర @ సిద్దు... ఇతనొక్కడే చోరీలకు పాల్పడ్డాడు. ఇతను డ్రైవర్ వృత్తి ద్వారా జీవిస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురుద్ధేశ్యంతో ద్విచక్ర వాహనాల చోరుడుగా మారాడు. ఇతనొక్కడే వెళ్లి పార్కింగ్ ప్రదేశాల్లో ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసి ఎత్తుకెళ్తాడు. ఇలా... అనంతపురం టూటౌన్, త్రీటౌన్, రూరల్ మరియు గుత్తి పోలీసు స్టేషన్ల పరిధుల్లో 08 కేసులు ఉన్నాయి.ఇదివరకే పాల్పడిన ద్విచక్ర వాహనాల దొంగతనాలపై 02 కేసులు ఉన్నాయి.
రెండవ ముఠా : షేక్ తౌహీద్ @ సోనూ మరియు మైనర్ కలిసి...
షేక్ తౌహీద్ @ సోనూ కార్పెంటర్ పని చేసేవాడు. ఇతను, ఇతని స్నేహితుడు (మైనర్ ) ఇద్దరూ కలిసి ముఠాగా ఏర్పడి బైకుల దొంగతనాలకు పాల్పడ్డారు. అనంతపురం ఒన్ టౌన్ మరియు ధర్మవరం టూటౌన్ పోలీసు స్టేషన్ల పరిధిల్లో ఇద్దరిపై చెరో 06 కేసులు ఉన్నాయి. ఈ కేసులతో పాటు మైనర్ పై పాతవి రెండు బైకు చోరీ కేసులున్నాయి. మైనర్ ను సి.డబ్ల్యు.సి ముందు హాజరు పరచనున్నారు.
మూడవ ముఠా:
నల్ల నాచప్పగారి గణేశ్, నూర్ మహమ్మద్ లు కలిసి
ఈ ఇద్దరిలో గణేష్ బేల్దారిగా నూర్ మహమ్మద్ బైకు మెకానిక్ లుగా జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు ఒకే ఊరి కావడంతో మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరిపైన మొత్తం 06 కేసులు ఉన్నాయి. వీటిల్లో 05 కేసులు కడప జిల్లాలో అనంతపురం ఒక కేసు నమోదయ్యాయి
అరెస్టు వివరాలు:
జిల్లాలో దొంగలపై నిఘా వేయాలని ఎస్పీ P.జగదీష్ ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో అనంతపురం అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనంతపురం సిసిఎస్, అనంతపురం వన్ టౌన్, త్రీటౌన్ సి.ఐ లు ఇస్మాయిల్, జైపాల్ రెడ్డి, రాజేంద్రనాథ్ యాదవ్, శాంతిలాల్ ... హెడ్ కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, వెంగప్ప, మక్బూల్ బాష, శ్రీధర్ మూర్తి కానిస్టేబుళ్లు రంజిత్, బాలకృష్ణ, షామీర్, ఎర్రిస్వామి, రమేశ్, మనోహర్, ప్రభులు ప్రత్యేక బృందంగా ఏర్పడి రాబడిన సమాచారం మేరకు అనంతపురంలోని SJR ఫంక్షన్ హాల్ వద్ద ఈ నిందితులను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఈ పోలీసు బృందాలను ప్రత్యేకంగా అభినందించారు.