రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Union Budget: ఎనిమిదో వార్షిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టినున్న నిర్మలమ్మ.. అంతకుముందు వీరే రికార్డ్?

trending post trendingnews viralposts viral news trendingnow trendingfashion trendingtopic trendings intresting facts Intersting news Viral news facts
Peoples Motivation

Union Budget: ఎనిమిదో వార్షిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టినున్న నిర్మలమ్మ.. అంతకుముందు వీరే రికార్డ్?

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets

Union Budget: శనివారం రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. అధిక ధరలతో మధ్య తరగతి ప్రజలు జీవనం సాగించడానికి ఇబ్బందులు పడుతున్న వేళ.. నాలుగేండ్ల క్రితం స్థాయికి వృద్ధిరేటు పతనం కావడంతోపాటు నిలిచిపోయిన వేతనాల గ్రోత్‌ నేపథ్యంలో ఆమె బడ్జెట్‌ సమర్పిస్తున్నారు. దేశానికి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఎనిమిదో వార్షిక బడ్జెట్‌ సమర్పించబోతున్నారు.

పది బడ్జెట్లతో మొరార్జీ దేశాయ్‌ రికార్డు

మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ సమర్పించిన పది వార్షిక బడ్జెట్‌ల రికార్డుకు చేరువలో ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్‌ 1959-1964 మధ్య ఆరు, 1967-1969 మధ్య నాలుగు బడ్జెట్‌లు సమర్పించారు. తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ, లాల్‌ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంల్లో బడ్జెట్‌లు సమర్పించారు. 1959 ఫిబ్రవరి 28న తొలిసారి బడ్జెట్‌ సమర్పించారు. అటుపై 1962లో ఇంటరిం బడ్జెట్‌, తిరిగి రెండు వార్షిక బడ్జెట్‌లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. నాలుగేండ్ల తర్వాత 1967లో ఇంటరిం బడ్జెట్‌, 1967-1969 మధ్య మూడు వార్షిక బడ్జెట్‌లు సమర్పించారు.


తొమ్మిది బడ్జెట్‌లు సమర్పించిన చిదంబరం

వేర్వేరు సమయాల్లో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తొమ్మిది బడ్జెట్‌లను పార్లమెంట్‌కు సమర్పించారు. తొలిసారి 1996 లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌ సమర్పించారు. హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా ఉండగా 1996 మార్చి 19న తొలి బడ్జెట్‌ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. తిరిగి 1997లో బడ్జెట్‌ సమర్పించారు. 2004-08 మధ్య వరుసగా ఐదు బడ్జెట్‌లను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. కొంత కాలం హోంమంత్రిగా పని చేసిన చిదంబరం.. తిరిగి 2013, 2014ల్లో బడ్జెట్‌ సమర్పించారు.

ప్రణబ్‌ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్‌లు..

ఇందిరాగాంధీ హయాం నుంచి వేర్వేరు సందర్భాల్లో ప్రణబ్‌ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్‌లు సమర్పించారు. తొలిసారి 1982, 1983, 1984, 2009 ఫిబ్రవరి – 2012 మార్చి మధ్య ఐదు బడ్జెట్‌లను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు.


ఐదు బడ్జెట్‌లు సమర్పించిన మన్మోహన్‌ సింగ్‌..

ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ 1991 నుంచి 1996 వరకూ ఐదు బడ్జెట్లు సమర్పించారు. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్‌ ఆర్థిక మంత్రిగా పని చేశారు.

Comments

-Advertisement-