రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Road Accident: ఇంటికి తిరుగు ప్రయాణంలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation
Road Accident: ఇంటికి తిరుగు ప్రయాణంలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
• పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..

• బొల్లవరం గ్రామానికి పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా..

• నలుగురు మహిళా కూలీలు మృతి.. మిగతా వారికి గాయాలు
General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు కూలీలు మృతిచెందారు. చాగంటివారిపాలెంకు చెందిన 25 మంది మహిళా కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బొల్లవరం గ్రామానికి ఆదివారం ఉదయం వెళ్లారు. ఎప్పటిలాగానే రోజంతా హుషారుగా పని చేసిన కూలీలు సాయంత్రం పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు. బొల్లవరంలో ట్రాక్టర్ ఎక్కి కొద్ది దూరం ప్రయాణించే సరికే ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో గంగమ్మ, సామ్రాజ్యం, మాదవి, పద్మ అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, కుటుంబసభ్యుల మరణవార్త విని బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని బోరున విలపించారు. గ్రామానికి చెందిన నలుగురు ఒకేసారి మృతిచెందడంతో చాగంటివారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

పల్నాడు జిల్లా, ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మ అనే నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.

ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి..

ప్రమాదంపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడిన గొట్టిపాటి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. వ్యవసాయ సీజన్లో రైతులు, కూలీలు పొలం పనులు మీద తిరిగే సమయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
Comments

-Advertisement-